మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని ఘనంగా ముగించింది, 50% లిమిటేషన్లు లాంటివి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర థియేటర్స్ రీ ఓపెన్ అయిన తర్వాత వచ్చిన మొదటి సినిమా అవ్వడంతో జనాలు సినిమాను బాగా ఆదరిస్తూ సాలిడ్ కలెక్షన్స్ ని మొదటి వీకెండ్ లో దక్కేలా చేశారు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు మొత్తం మీద 1.8 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కొంచం తగ్గి ఈసారి 1.62 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో రాబట్టగా సినిమా వరల్డ్ వైడ్ గా 1.73 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద మంచి కలెక్షన్స్ ని సాధించిన…
సోలో బ్రతుకే సో బెటర్ సినిమా 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 55L
👉Ceeded: 31L
👉UA: 21L
👉East: 12L
👉West: 8L
👉Guntur: 16L
👉Krishna: 11L
👉Nellore: 8L
AP-TG Total:- 1.62CR(2.81 Gross)
ఇవి సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ వివరాలు.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 2.25Cr
👉Ceeded: 1.17Cr
👉UA: 93L
👉East: 52L
👉West: 34L
👉Guntur: 53L
👉Krishna: 37L
👉Nellore: 32L
AP-TG Total:- 6.43CR(8Cr+ Gross)
KA+ROI: 44L
Os: 31L
Total WW: 7.18Cr(12.25Cr Gross)
ఇవి సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ వివరాలు. వరల్డ్ వైడ్ గా 12.25 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ తో సినిమా అల్టిమేట్ గా హోల్డ్ చేసి సత్తా చాటుకుంది అని చెప్పాలి.
సినిమా ను టోటల్ వరల్డ్ వైడ్ గా 9.2 కోట్లకు అమ్మగా సినిమా 9.6 కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజులు కంప్లీట్ అయిన 7.18 కోట్ల షేర్ ని సాధించిన సినిమా ఇప్పుడు మిగిలిన రన్ లో మరో 2.42 కోట్ల షేర్ ని వసూల్ చేస్తే క్లీన్ హిట్ అవుతుంది, వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా హోల్డ్ చేస్తుంది అన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది అని చెప్పాలి.