ఎప్పుడో సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయిన సినిమా శివకార్తికేయన్ నటించిన శక్తి మూవీ… తెలుగు లో ఇక రిలీజ్ అనుకున్న టైం లో సడెన్ గా కరోనా ఎంటర్ అవ్వడం తో ఈ సినిమా డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోవాల్సి వచ్చింది, తర్వాత టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయిన సినిమా మంచి టి.ఆర్.పి రేటింగ్ లను సొంతం చేసుకుని టెలివిజన్ లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇక థియేటర్స్ రీ ఓపెన్ 8 నెలల తర్వాత అవ్వగా కొత్త సినిమాలు ఏవి లేక పోవడం తో ఓల్డ్ మూవీస్ ని ఒక్కొటిగా థియేటర్స్ లో రిలీజ్ చేయడం మొదలు పెట్టగా అందులో భాగంగా శక్తి సినిమా ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా కొత్త సినిమా అయినా…
రామ్ గోపాల్ వర్మ కరోనా సినిమా కి పోటిగా నిలిచినా కానీ తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయినా కానీ ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ ని సాధించి సత్తా చాటుకుంది. ఈ సినిమా మొత్తం మీద 4 రోజుల్లో స్క్రీన్స్ ని 70 కి పెంచుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో…
2 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసి బాగా గ్రోత్ ని సొంతం చేసుకుంది, ఇక పరుగు ని రీసెంట్ గా ముగించిన ఈ సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 4 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుందని సమాచారం. చాలా లిమిటెడ్ రిలీజ్ లో అన్ని అంశాల నడుమ ఇవి మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి… అందులో ఎక్కువగా వైజాగ్ నుండి 1.2 లక్షల షేర్ ని…
నైజాం లో 1 లక్ష షేర్ ని మిగిలిన చోట్ల 1.8 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.. నార్మల్ రిలీజ్ అయ్యి ఉంటె ఈ కలెక్షన్స్ మినిమం 20 నుండి 25 లక్షల రేంజ్ లో ఉండేవి కానీ ప్రస్తుత పరిస్థితులను చూసుకుంటే పర్వాలేదు అని చెప్పొచ్చు. ఇక కొత్త సినిమాల రిజల్ట్ లు ఎలా ఉంటాయో చూడాలి మరి..