నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఆల్ మోస్ట్ రెండేళ్ళ తర్వాత నాని నటించిన సినిమా ఆడియన్స్ ముందుకు రాగా మధ్యలో చేసిన 2 సినిమాలు డిజిటల్ లో రిలీజ్ అయ్యాయి. శ్యామ్ సింగ రాయ్ పై మొదటి నుండి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న నాని, కాన్ఫిడెంట్స్ నిజం అయ్యిందా లేదా అంటే నిజం అయ్యింది అనే చెప్పాలి. సినిమా రివ్యూ లోకి వెళితే…
కథ ఓపెన్ అవ్వడం సాఫ్ట్ వేర్ అయినా మూవీస్ మీద పాషన్ తో ఓ షార్ట్ ఫిలిం ను హీరోయిన్ కృతి శెట్టితో చేసిన నాని ఆ షార్ట్ ఫిల్మ్ సూపర్ సక్సెస్ అవ్వడంతో సినిమా ఛాన్స్ దక్కుతుంది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఆఫర్స్ వెల్లువగా వస్తూ ఉండగా…
అనుకోకుండా ఈ కథ ప్రజెంట్ నానిది కాదని, 1970 టైం లో శ్యామ్ సింగ రాయ్ రాసిన కథ అని తెలుస్తుంది. అసలు శ్యామ్ సింగ రాయ్ ఎవరు, అతనికి ప్రజెంట్ నాని కి సంభందం ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అనే విశేషాలు అన్నీ కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
ఓ ఫ్రెష్ స్టొరీ పాయింట్ ని తీసుకుని ఆ పాయింట్ కి పూర్వజన్మని లింక్ చేస్తూ కథని చాలా బాగా రాసుకున్నాడు రాహుల్ సంక్రిత్యన్… ఆ కథని నాచురల్ నాని ఎంత న్యాయం చేయాలో అంతకన్నా ఎక్కువే చేశాడు, తన నటన, డైలాగ్స్, యాక్షన్ ఇలా అన్నీ హైలెట్ అవ్వగా శ్యామ్ సింగ రాయ్ రోల్ లో అదరగొట్టేశాడు అనే చెప్పాలి.
ఇక సాయి పల్లవి రోల్ కూడా చాలా బాగా మెప్పించగా కృతి రోల్ చిన్నదే అయినా పర్వాలేదు అనిపించగా మడోన్నా సెబాస్టియన్ రోల్ కూడా పర్వాలేదు అనిపించగా మిగిలిన రోల్స్ కూడా ఉన్నంతలో ఆకట్టుకున్నారు. ఇక డైలాగ్స్ సినిమాలో చాలా బాగా రాసుకున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా శ్యామ్ సింగ రాయ్ డైలాగ్స్ ఎక్స్ లెంట్ గా ఉన్నాయి.
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం స్లోగా పొయెటిక్ గా సాగుతుంది. కానీ డిఫెరెంట్ గా ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. ఇక సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్, పాటలు ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు చాలా సీన్స్ ని హైలెట్ చేసింది అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా బాగుండగా…
ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే స్టొరీ పాయింట్ ఫ్రెష్ గా ఉన్నప్పటికీ కథ టేక్ ఆఫ్ అవ్వడానికి టైం చాలానే తీసుకున్నాడు డైరెక్టర్. దాంతో ఫస్టాఫ్ కొంచం యావరేజ్ గా అనిపించి సాలిడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచగా…
సెకెండ్ ఆఫ్ ఆ అంచనాలను తగ్గట్లు చాలా సీన్స్ మెప్పించగా కథ లో కొన్ని ఇల్లాజికల్ అండ్ సిల్లీ సీన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఓ డిఫెరెంట్ అండ్ మంచి మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో హైలెట్స్ విషయానికి వస్తే నాని పెర్ఫార్మెన్స్, సాయి పల్లవి యాక్టింగ్…
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, బ్యాగ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ అండ్ స్టొరీ కాన్సెప్ట్ అని చెప్పాలి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ స్లోగా ఉండటం, కథ టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పట్టడం, కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా ఉండటం అని చెప్పాలి, అయినా కానీ ఆడియన్స్ అంచనాలు పెట్టుకుని వెళ్ళినా పెట్టుకోకుండా వెళ్ళినా సినిమా అయ్యాక ఓ మంచి సినిమా…
చూశాం అన్న భావనతో థియేటర్స్ బయటికి రావడం ఖాయమని చెప్పొచ్చు. రెగ్యులర్ మాస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు, కామన్ ఆడియన్స్ సినిమాను ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అన్న దానిపై సినిమా ఏ రేంజ్ కి వెళుతుందో చెప్పగలం. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్…