ఆల్ మోస్ట్ 9 నెలల తర్వాత థియేటర్స్ లో సందడి చేయడానికి ధైర్యం చేసి మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా క్రిస్టమస్ కానుకగా వరల్డ్ వైడ్ గా రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది, ఆడియన్స్ లో కరోనా తర్వాత థియేటర్స్ కి వెళ్ళాలా వద్దా అన్న టెన్షన్ ఉన్నప్పటికీ కూడా మిగితా అన్ని పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు సినిమా హాల్స్ కి వెళ్ళడానికి…
ఇబ్బంది ఏంటి అంటూ ఇప్పుడు థియేటర్స్ కి తరలి వస్తున్నారు. ఇక సాయి ధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఇక్కడ మరో విశేషం సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలలో…
కొన్ని చోట్ల స్పెషల్ షోలు కూడా పడ్డాయి, ఇక దుబాయ్ లో ఇక్కడ ఆ షోలు పూర్తీ అవ్వగా అక్కడ నుండి సినిమా కి మొదటి టాక్ కూడా బయటికి వచ్చింది అని చెప్పాలి. ఆ టాక్ ప్రకారం ఫస్టాఫ్ మొత్తం ఎంటర్ టైనింగ్ ఉంటుందని, సెకెండ్ ఆఫ్ కొంచం డ్రాగ్ చేశారనిపిస్తుందని…
కానీ ఆడియన్స్ ని చాలా వరకు కనెక్ట్ అయ్యేలా సినిమా ఉందని అంటున్నారు. సాయి ధరం తేజ్ తన రోల్ వరకు అదరగొట్టేషాడని అంటున్నారు. మొత్తం మీద సినిమా యావరేజ్ టు ఎబో యావరేజ్ అనిపించే రేంజ్ లో ఉందని టాక్ చెబుతున్నారు. క్రిస్టమస్ సెలవుల్లో ఇలాంటి టాక్ సరిపోతుంది అని చెప్పొచ్చు. ఇక రోజు గడుస్తున్న కొద్ది అసలు సిసలు…
టాక్ ఏంటి అన్నది బయటికి వస్తుంది…. మొత్తం మీద ఇనీషియల్ టాక్ ప్రకారం చూసుకుంటే సాయి ధరం తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చూపే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. టాక్ మరింత పాజిటివ్ గా ఉంటె సినిమా కి అది లాంగ్ రన్ లో మరింత హెల్ప్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ జోరు ఎలా ఉంటుందో చూడాలి.