మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ చిత్రలహరి మరియు ప్రతిరోజూ పండగే సినిమాల బాక్ టు బాక్ హిట్స్ తర్వాత చేసిన సినిమా సోలో బ్రతుకే సో బెటర్, ఎప్పుడో సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన ఆగిపోతూ రాగా ఎట్టకేలకు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడానికి సిద్ధం అయ్యి ఈ నెల 25 న క్రిస్టమస్ కానుకగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.
ఇక ఈ సందర్భంగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గా లాంచ్ చేశారు. సినిమా టైటిల్ కి తగ్గట్లే ట్రైలర్ లో సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది క్లియర్ గానే చెప్పేశారు. లవ్ అండ్ మ్యారేజ్ లు వద్దూ సోలో బ్రతుకే చాలా బెటర్ అంటూ హీరో నినాదాలు చేస్తూ…
తన కంట బడ్డ లవర్స్ అందరినీ విడదీస్తూ ఉండటం, కట్ చేస్తే హీరోయిన్ ఎంట్రీ తో తన లైఫ్ కూడా మారిపోవడం, తను కూడా లవ్ లో పడ్డాడో లేదో అన్న డౌట్ లో ఉన్న టైం లో తను ఆరాధించే ఆర్ నారాయణ మూర్తి కూడా ఏ ఏజ్ లో జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి అంటూ హితబోద చేయడంతో….
హీరో కి ఎం చేయాలో తెలియని పరిస్థితి లో ట్రైలర్ ముగుస్తుంది… మొత్తం మీద కాన్సెప్ట్ ఏంటి అనేది ఇక్కడే చెప్పేసినా ఎంటర్ టైన్ మెంట్ వర్కౌట్ అయ్యేలా ఉండటం సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మెప్పించే విధంగా ఉండటం తో సినిమా కి ఇది కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. రెండు హిట్స్ కొట్టి జోరు మీదున్న సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్…
ట్రైలర్ వరకు ఆ జోరు ని కంటిన్యు చేశాడనే చెప్పాలి, ఇక సినిమా ఎంతవరకు ఆకట్టుకుని మెప్పిస్తుంది అనేది ఈ నెల 25 న తేలనుంది. ఇక యూట్యూబ్ లో తొలి 24 గంటల్లో ఈ ట్రైలర్ కి ఎన్ని మిలియన్స్ వ్యూస్ అండ్ లైక్స్ వస్తాయి అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.. 24 గంటల తర్వాత ఆ రిపోర్ట్ ని అప్ డేట్ చేస్తాం.
https://www.youtube.com/watch?v=CtRvAZSQH5I