Home న్యూస్ సూర్యవంశీ రివ్యూ….ఆ 30 నిమిషాలు పూనకాలే!!

సూర్యవంశీ రివ్యూ….ఆ 30 నిమిషాలు పూనకాలే!!

0

బాలీవుడ్ కి తిరిగి ఊపిరి పోయడానికి ఏడాదిన్నర నుండి ఆగిన అక్షయ్ కుమార్ రోహిత్ శెట్టి ల లేటెస్ట్ మూవీ సూర్యవంశీ ఆడియన్స్ ముందుకు ఎట్టకేలకు వచ్చేసింది, కామెడీ అండ్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రోహిత్ శెట్టి సింగం, సింబా ల తర్వాత సూర్యవంశీతో కాప్ యూనివర్స్ ని క్రియేట్ చేశాడు, అందులో భాగంగా అజయ్ దేవగన్, రణవీర్ సింగ్ లు సినిమాలో స్పెషల్ ఎంట్రీతో సినిమా పై అంచనాలను పెంచారు….

మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ… స్టొరీ పాయింట్ కి వస్తే 1993 ముంబై బాంబ్ బ్లాస్ట్ లో 1 టన్ ఆర్ డి ఎక్స్ ఇండియాకి రాగా ఆ బాంబ్ బ్లాస్టులలో 400KG వాడగా ఇంకా 600KG ఇండియాలోనే ఉంది, అదే టైం లో 40 మంది స్లీపర్ సెల్స్ ఇండియాకి వచ్చి ఇక్కడే ఉంటారు….2020 లో అతి పెద్ద బ్లాస్ట్ కి ప్లాన్ చేసి…..

ఇండియాలో ప్లాన్ చేయగా స్పీలర్ సెల్స్ యాక్టివ్ అయిన తర్వాత హీరో ఎలా వీళ్ళని ఆపాడు అన్నది సినిమా కథ పాయింట్… ఇదే పాయింట్ తో తుపాకీ సినిమా రాగా ఆ కథ ఫస్టాఫ్ వరకు అయిపోయి తర్వాత హీరో విలన్ గేమ్ నడుస్తుంది కానీ ఇక్కడ ఇంటర్వల్ పాయింట్ ని సినిమా ఎండ్ వరకు తీసుకు వెళ్ళారు.

కథ అంత బలంగా ఏమి లేదు, కత్రినాకైఫ్ స్క్రీన్ పైకి వచ్చినప్పుడల్లా కథకి అడ్డు పడుతూ ఫ్లాష్ బ్యాక్ లేదా సాంగ్ వస్తుంది, అసలు ఫైట్స్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయా అని ఎదురు చూస్తూ ఆడియన్స్ ఎదురు చూస్తున్న టైం లో ఒకటి రెండు ఫైట్స్ ఆకట్టుకున్న కథ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతున్న టైం లో చివరి 30 నిముషాలు అసలు వార్ మొదలు అవుతుంది…

రణవీర్ సింగ్ ఎంట్రీతో అప్పటి వరకు స్లోగా సాగుతున్న కథకి ఊపు వచ్చి క్లైమాక్స్ పై ఆసక్తి పెరిగి తర్వాత సింగంగా అజయ్ దేవగన్ ఎంట్రీతో మరింత హైకి వెళ్లి అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ మరియు రణవీర్ సింగ్ ల ఫైట్ తో సినిమా మంచి హై ఇచ్చేలా ఎండ్ అవుతూ… ఈ సిరీస్ లో అప్ కమింగ్ మూవీగా సింగం ఈ బ్లాస్ట్ లు ప్లాన్ చేస్తున్న…

జాకీష్రాఫ్ ని ఎలాగైనా పట్టుకుంటా అంటూ చాలెంజ్ చేసి సింగం 3 ఉందని చెబుతుంది… సినిమాలో చాలా సీన్స్ అక్షయ్ కుమార్ ఆల్ రెడీ చేసిన బేబీ సినిమాను పోలి ఉంటాయి, అక్కడక్కడా అక్షయ్ కుమార్ మతిమరుపు కామెడీ కూడా వర్కౌట్ అవ్వగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది, యాక్షన్ సీన్స్ విజువల్స్ అదిరిపోగా…. కథ ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉండటం, రొటీన్ స్క్రీన్ ప్లే తో…

సినిమా మరీ అంచనాలు ఓ రేంజ్ లో పెట్టుకుంటే లాస్ట్ 30 నిమిషాలు తప్ప పెద్దగా మిగిలిన కథ కిక్ ఏమి ఇవ్వదు, రోహిత్ శెట్టి డైరెక్షన్ ముగ్గురు హీరోల కలయికలో ఉన్న సీన్స్ మట్టుకు బాగా రాసుకున్నా మిగిలిన సీన్స్ స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉంది, అయినా కానీ బాలీవుడ్ లవర్స్ కి ఈ మాత్రం యాక్షన్ సీన్స్ సరిపోతాయి అనే చెప్పాలి. మనం ఇలాంటివి చూసి ఉన్నాం కాబట్టి లాస్ట్ 30 నిమిషాలు మినహా కథ అంతగా కిక్ ఇవ్వలేదు… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here