ప్రస్తుతం వరల్డ్ వైడ్ సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమాలలో మోస్ట్ వాంటెడ్ మూవీ స్పైడర్ మాన్ నో వే హోమ్ అని చెప్పాలి. ఈ సినిమా మీద అవెంజర్స్ ని మించిన హైప్ ఏర్పడింది ఇప్పుడు. ఆ బజ్ ఏ రేంజ్ లో ఉందో ఆల్ రెడీ రిలీజ్ అయిన టీసర్ ట్రైలర్ ల రికార్డులను చూస్తె అర్ధం అవుతుంది. సోషల్ మీడియా ని ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా..
ఇక అమెరికాలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఈ మధ్యే మొదలు పెట్టగా అన్ని చోట్ల బుకింగ్స్ ఊహకందని లెవల్ లో సాగడంతో చాలా లోకేషన్స్ లో సర్వర్లు క్రాష్ అయ్యి చాలా సైట్స్ ఓవర్ ట్రాఫిక్ తో కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయిందని అంటున్నారు… ఈ రేంజ్ క్రేజ్ చూసి ఆల్ మోస్ట్…
2 ఏళ్ళు అవుతుందని, అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత అంతకుమించిన రచ్చని ఈ సినిమా సృష్టించే అవకాశం ఉండగా ఇండియాలో ఇప్పుడు ఒక రోజు ముందుగానే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు డిసెంబర్ 16న రిలీజ్ కాబోతుందని అంటున్నారు. ఇక ఇండియాలో కూడా ఎలాంటి సంచలనాలను ఈ సినిమా సృష్టిస్తుందో చూడాలి.