బాహుబలి(Baahubali) ప్రభంజనంలో అన్ని రికార్డులు ఆవిరి అయిన వేల 2015 టైంలో టాలీవుడ్ మార్కెట్ వరల్డ్ వైడ్ గా ఒక్క సారిగా పెరిగిపోయిన వేల బాహుబలి రిలీజ్ కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకోగా బాహుబలి ఎపిక్ ఇండస్ట్రీ రికార్డులతో మెంటల్ మాస్ జాతరను సృష్టించింది….
ఇక మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు(9 Years For Srimanthudu Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం ఆలస్యంగా రిలీజ్ అవ్వగా బాహుబలి ఊహకందని విజయం తర్వాత ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిన ఆడియన్స్ తిరిగి భారీ సంఖ్యలో థియేటర్స్ కి వచ్చేలా చేసిన మహేష్ బాబు శ్రీమంతుడు…
అల్టిమేట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 50వ రోజున 2.28 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని టాలీవుడ్ చరిత్రలో 50వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ తో రికార్డ్ ను అందుకుంది. ఇక బాహుబలి రికార్డుల తర్వాత…ఫస్ట్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన…
ఎపిక్ బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు సినిమా రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తి అయ్యింది..ఈ సందర్భంగా ఒకసారి టోటల్ రన్ లో శ్రీమంతుడు సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
శ్రీమంతుడు టోటల్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి
నైజాం( తెలంగాణ ) 22.45 కోట్లు
సీడెడ్ 9.50 కోట్లు
వైజాగ్ 5.70 కోట్లు
కృష్ణ 4.50 కోట్లు
గుంటూరు 5.80 కోట్లు
ఈస్ట్ 6.20 కోట్లు
వెస్ట్ 4.48 కోట్లు
నెల్లూరు 2.29 కోట్లు
టోటల్ AP/TG కలెక్షన్స్ 60.92 కోట్లు
కర్ణాటక 7.17 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.30 కోట్లు
ఓవర్సీస్ 15.10 కోట్లు
మొత్తం కలెక్షన్స్ 24.57 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ తెలుగు వర్షన్ కలెక్షన్స్ 85.49 కోట్లు
తమిళ్ టోటల్ కలెక్షన్స్ 0.80 కోట్లు
మళయాళ వర్షన్ టోటల్ కలెక్షన్స్ 0.46 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ వర్షన్ కలెక్షన్స్ 86.75 కోట్లు
పెట్టిన డబ్బు ( ఎస్టిమేషన్ ) 50 కోట్లు
అమ్మిన రేటు ( ఎస్టిమేషన్ ) 56 కోట్లు
*****ఆల్ టైం Non BB బ్లాక్ బస్టర్*****
మొత్తం మీద 56 కోట్ల బిజినెస్ మీద 30 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా… ఫస్ట్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా మహేష్ బాబుకి 1 నేనొక్కడినే, ఆగడు లాంటి ఎపిక్ డిసాస్టర్స్ తర్వాత ఊహకందని ఇండస్ట్రీ హిట్ రేంజ్ కంబ్యాక్ ను సొంతం అయ్యేలా చేసింది….