కన్నడ స్టార్ హీరోలలో ఒకరైన కిచ్చా సుదీప్(Kichcha Sudeep) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మాక్స్(Max The Movie Review in Telugu)…ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది. విక్రాంత్ రోనా సినిమా తర్వాత ఆల్ మోస్ట్ 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఈ సినిమా చేశాడు సుదీప్… మరి సినిమా ఎలా ఉంది…ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే సిన్సియర్ పోలిస్ ఆఫీసర్ అయిన హీరో చాలా ట్రాన్స్ ఫర్స్ తర్వాత ఒక పోలిస్ స్టేషన్ కి SI గా ఛార్జ్ తీసుకోబోతుంటాడు…ఈ క్రమంలో డ్రగ్స్ మత్తులో మినిస్టర్ కొడుకులు ఓ లేడీ పోలిస్ కానిస్టేబుల్ తో మిస్ బిహేవ్ చేస్తారు…
వాళ్ళని పోలిస్ స్టేషన్ కి తీసుకురాగా అనుకోకుండా వాళ్ళు చనిపోతారు…దాంతో పోలీసులు అందరూ భయపడిపోతారు…ఈ టైంకే ఛార్జ్ తీసుకోవడానికి వచ్చిన హీరో ఏం చేశాడు…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….కథ పాయింట్ పర్వాలేదు అనిపించేలా ఉన్నా కూడా…
చాలావరకు కథ చూస్తున్న టైంలో ఇదే పాయింట్ తో తెరకెక్కిన కార్తి ఖైదీ సినిమా గుర్తుకు వస్తుంది…కానీ ఇక్కడ కూడా ఆకట్టుకునే సీన్స్ సినిమాలో బాగానే మెప్పించాయి..కిచ్చా సుదీప్ యాక్టింగ్ బాగా మెప్పించింది…యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో కుమ్మేశాడు…..హీరోయిజం ఎలివేట్ సీన్స్ బాగున్నాయి…
కానీ కథని డైరెక్టర్ మరింత టైట్ స్క్రీన్ ప్లే తో చెప్పి ఉంటే బాగుండేది…డ్రాగ్ అయినట్లు, అక్కడక్కడా బోర్ ఫీల్ అయినట్లు చేస్తుంది సినిమా…ఇక ఇతర పాత్రల్లో సునీల్ రెగ్యులర్ నటనతో ఓకే అనిపించగా వరలక్ష్మి శరత్ కుమార్ నెగటివ్ రోల్ లో ఆకట్టుకుంది…
బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ను బాగా ఎలివేట్ చేసింది….ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకోగా…డైరెక్షన్ విషయానికి వస్తే కథ ని ఖైదీ నుండి ఇన్స్పైర్ గా తీసుకుని తీసినట్లు అనిపించింది. చాలా వరకు సినిమా ఎంగేజింగ్ గానే అనిపించినా కథ కొంచం డ్రాగ్ అవ్వడంతో బోర్ ఫీల్ కూడా కలుగుతుంది…
అప్ డౌన్స్ ఉన్న కూడా యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఖైదీ టైప్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి మాక్స్ మూవీ కొంచం పడుతూ లేస్తూ సాగినా కూడా పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు… రెగ్యులర్ ఆడియన్స్ కొంచం ఓపిక తెచ్చుకుని చూస్తె ఓకే అనిపిస్తుంది సినిమా…సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…