రీసెంట్ గా యాంకర్ ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సెన్సేషనల్ హిట్ అవ్వగా టీవీ రంగం నుండే సినిమాల్లోకి వచ్చిన సుడిగాలి సుధీర్ నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్ కలెక్షన్స్ కోసం చాలామంది అడిగారు…ఆ వివరాలు ఇవే… జబర్దస్త్ కామెడీ షో తో మంచి పాపులారిటీ ని సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ ఆ క్రేజ్ ని అడపా దడపా హీరోగా కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ వాడుకున్నా కానీ ఒక పెర్ఫెక్ట్ లాంచ్ మూవీ తో ఆడియన్స్ ముందుకు రాలేదు. ఇలాంటి టైం లో రీసెంట్ గా సాఫ్ట్ వేర్ సుధీర్ అంటూ పక్కా ప్లానింగ్ తో లాంచ్ పాడ్ ని సిద్ధం చేసుకుని ఈ సినిమా తో…
లాంచ్ అయ్యాడు… సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ బిలో యావరేజ్ రేంజ్ లోనే వచ్చినా కానీ ఓవరాల్ గా సంక్రాంతి మూవీస్ వచ్చే వరకు రన్ బాగానే సొంతం చేసుకుని మొత్తం మీద పర్వాలేదు అనిపించే రిజల్ట్ తో ఈ సినిమా పరుగు ను ముగించింది.
సినిమా అఫీషియల్ బిజినెస్ ఎంత అనేది రివీల్ చేయలేదు కానీ ట్రేడ్ లో ఈ సినిమా 1.8 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సాధించిందని సమాచారం.. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి 10 రోజుల్లో ఈ సినిమా మొత్తం మీద…
1.30 కోట్ల దాకా షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. ఇక మిగిలిన రన్ లో మరో 16 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా టోటల్ రన్ పూర్తీ అయ్యే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర 1.46 కోట్ల షేర్ ని వసూల్ చేసి యావరేజ్ అనిపించే రిజల్ట్ ని సొంతం చేసుకుంది.
బిజినెస్ పరంగా చూసుకుంటే 34 లక్షల మేర లాస్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.. ఓవరాల్ గా హీరో గా లాంచ్ అయిన మొదటి సినిమా తో పెద్దగా ప్రమోషన్ లేకుండానే డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. మొత్తం మీద టీవీ రంగం నుండి ఇటు ప్రదీప్ కానీ ఇటు సుధీర్ కానీ డీసెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్నారు అని చెప్పాలి..