Home న్యూస్ టాక్సీవాలా రివ్యూ….2.75/5

టాక్సీవాలా రివ్యూ….2.75/5

0

          గీత గోవిందం లాంటి హిస్టారికల్ హిట్ తర్వాత నోటా లాంటి బిగ్ డిసాస్టర్ మూవీ తో దెబ్బ తిన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు టాక్సీవాల సినిమా తో వచ్చేశాడు. ఎప్పుడో సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అనేక లీకులు, సమస్యలను ఎదురుకుని పోస్ట్ పోన్ అవుతూ రాగా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు ఈ రోజు వచ్చేసింది. ఓవర్సీస్ లో సినిమా కి మంచి టాకే లభించింది అని చెప్పొచ్చు. ఇక అసలు సిసలు టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.

స్టోరీ లైన్: చదువు అయ్యి 5 ఏళ్ళు అవుతున్నా ఉద్యోగం లేని హీరో అనేక చిన్న చితకా జాబ్స్ ట్రై చేసినా ఏవి సెట్ కావు. అలాంటి సమయంలో ఒక టాక్సీ అమ్మకానికి రావడంతో ఆ టాక్సీ ని కొనుక్కుని కాబ్ లాగా నడుపుతూ జీవితాన్ని కొనసాగిస్తుండగా అనుకోకుండా ఆ టాక్సీ లో ఒక ఆత్మ ఉందని తెలుసుకుంటాడు.

ఆ ఆత్మ ఆ టాక్సీ లోకి ఎందుకు వచ్చింది… వచ్చాక హీరో ఏం చేశాడు అన్నది అసలు కథ. కథ పాయింట్ కొంచం రొటీన్ అయినా దానికి ఒక సూపర్ నాచురల్ పవర్ ని యాడ్ చేసి బాగానే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీ ని స్క్రీన్ ప్లే ని రాసుకున్నాడు దర్శకుడు కానీ…

నటీనటులు: విజయ్ దేవరకొండ ఎప్పటి లానే తన రోల్ లో కుమ్మెశాడు… సింగిల్ లైన్ డైలాగ్స్ తో లైట్ నోటెడ్ కామెడీ సీన్స్ తో మొదటి అర్ధభాగం ఆకట్టుకోగా హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీ కూడా బాగానే మెప్పించింది. హీరోయిన్ ప్రియాంక లుక్స్ అండ్ నటన ఒకే అనిపిస్తాయి.

మిగిలిన నటీనటులు తమ పరిది మేర నటించి మెప్పించగా సినిమా మొత్తం విజయ్ దేవరకొండ మార్క్ సీన్స్ పెద్దగా లేకున్నా ఉన్నంతలో నటనతో ఆకట్టుకుని సినిమాని తన భుజాన మోసి చాలా వరకు మెప్పించాడు విజయ్ దేవరకొండ. బయపడే సీన్స్ లో కూడా మెప్పించగలిగాడు.

సంగీతం: సంగీతం విషయం లో మాటే వినధుగా సాంగ్ టోటల్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. మిగిలిన పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఫీల్ కి తగ్గట్లు ఉంటుందని అని చెప్పలి. ఓవరాల్ గా సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం: ఎడిటింగ్ బాగానే ఉన్నా చివరి 30 నిమిషాలు మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది, స్క్రీన్ ప్లే అక్కడక్కడా ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండటం కొంచం మైనస్ అయింది. కేమరామెన్ పనితనం బాగుంది, విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయం లో యూ‌వి క్రియెషన్స్ మరియు గీత ఆర్ట్స్ కాంప్రమైజ్ కాకుండా తీశాడు.

విశ్లేషణ: దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ని ఓవరాల్ సినిమా 2 గంటల 11 నిమిషాల్లో 1 గంటా 40 నిమిషాల వరకు మెప్పించాడు. కానీ చివరి 30 నిమిషాల ఎపిసోడ్ కొంత బోర్ కొట్టిన ఫీలింగ్, ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండేలా చూసుకోకుండా ఉంటే సినిమా రేంజ్ మరింత పెరిగేది.

ఉన్నంతలో దర్శకుడు రాహుల్ బాగానే మెప్పించాడు అని చెప్పొచ్చు. విజయ్ ప్రస్తుత క్రేజ్ ని పెద్దగా వాడుకోకుండా కేవలం సినిమా కథ కి ఎంత కావాలో అంతే వాడుకున్నాడు. సెకెండ్ ఆఫ్ స్లో అవ్వకుండా చూసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఓవరాల్ గా డైరెక్షన్ బాగుందని చెప్పొచ్చు.

హైలెట్స్: విజయ్ దేవరకొండ, కామెడీ సీన్స్, మాటే వినదుగా సాంగ్, ఇంటర్వల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్: ప్రిడిక్ట్ చేసే స్టోరీ, చివరి 30 నిమిషాలు,

ఓవరాల్ గా టాక్సీ వాలా రీసెంట్ నోటా కన్నా చాలా బెటర్ మూవీ అని చెప్పాలి. చివరి 30 నిమిషాలు ఎంతమందికి కనెక్ట్ అవుతుంది అన్నదానికి సినిమా రేంజ్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు. టోటల్ గా సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here