Home న్యూస్ తండేల్ 1st DAY కలెక్షన్స్ టార్గెట్….కెరీర్ బెస్ట్ కొడతాడా లేదా!!

తండేల్ 1st DAY కలెక్షన్స్ టార్గెట్….కెరీర్ బెస్ట్ కొడతాడా లేదా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర థాంక్ యు కస్టడీ లాంటి బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తో సతమతం అవుతున్నప్పటికీ కూడా యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా మీద ఆడియన్స్ లో సాలిడ్ క్రేజ్ అయితే ఉందని చెప్పాలి. సాయి పల్లవి హీరోయిన్ అవ్వడం..

సినిమా పాటలు ఆడియన్స్ లో ఓ రేంజ్ లో రీచ్ ను సొంతం చేసుకోవడంతో ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా రిమార్కబుల్ ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సంక్రాంతి సినిమాల హవా కూడా తగ్గడంతో…

ఆడియన్స్ అందరూ కూడా ఇప్పుడు ఈ సినిమా కోసమే ఆశగా ఎదురు చూస్తున్నారు….ఇక బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా నాగ చైతన్య కి ఈ సినిమా తో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసే అవకాశం అయితే ఉందని చెప్పాలి ఇప్పుడు…

ఒకసారి నాగ చైతన్య రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్ ని గమనిస్తే… 
#NagaChaitanya Recent Movies 1st Day AP TG Shares
👉#Custody – 1.82CR
👉#ThankYou – 1.65Cr
👉#LoveStory – 7.13CR
👉#Majili – 5.6Cr
👉#SavyaSachi – 3.29Cr
👉#ShailajaReddyAlludu – 6.93Cr
👉#Bangarraju – 9.06CR(Multi Starer)
👉#VenkyMama- 7.05Cr(Multi Starer)
మల్టీ స్టారర్ లు పక్కకు పెడితే మిగిలిన సినిమాల్లో…లవ్ స్టోరీ మూవీ కోవిడ్ టైం లో కూడా…

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది….అందులో కూడా నాగ చైతన్యకి జోడిగా సాయి పల్లవి నటించింది…. ఇక ఇప్పుడు ఆ సినిమా రేంజ్ లోనే సాలిడ్ బజ్ ను సొంతం చేసుకున్న తండేల్ మూవీ టైర్ 2 హీరోల సినిమాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ ను…

అందుకోవడం సాధ్యామా కాదా అన్నది త్వరలో తేలనుండగా నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. టాక్ మినిమమ్ పర్వాలేదు అనిపించేలా వచ్చినా 7-9 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ మొదటి రోజు నమోదు అయ్యే అవకాశం ఉంది… ఇక ఈ సినిమా తో నాగ చైతన్య ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here