బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో కెరీర్ లోనే ఫాస్టెస్ట్ 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని మాస్ భీభత్సం సృష్టించిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో అన్ని చోట్లా ఊరమాస్ జోరుని చూపెడుతూ దుమ్ము దుమారం లేపుతూ ఉండగా….రెండు బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత…
ఈ సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవడమే కాదు కలెక్షన్స్ పరంగా కూడా ఊచకోత కోస్తూ వారం రోజుల్లోనే ఇప్పుడు నాగ చైతన్య కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది… ఇది వరకు నాగ చైతన్య కెరీర్ లో సోలో హీరోగా…
మజిలీ మూవీ టోటల్ రన్ లో 40.25 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా తర్వాత నాగ చైతన్య నటించిన సినిమాలు పర్వాలేదు అనిపిస్తూ ఉండగా తర్వాత బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తో ఇబ్బంది పడ్డ తరుణంలో తండేల్ మూవీ అన్ సీజన్ లో సాలిడ్ బజ్ ను సొంతం చేసుకుని..
కలెక్షన్స్ పరంగా కూడా అంచనాలను మించి పోయే రేంజ్ లో భీభత్సం సృష్టిస్తూ అన్ని చోట్లా మాస్ వసూళ్ళని అందుకుని ఇప్పుడు 43 కోట్లకు పైగా షేర్ మార్క్ ని దాటేసి మజిలీ లైఫ్ టైం కలెక్షన్స్ ని బీట్ చేసి నాగ చైతన్య కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి…
ఇప్పుడు తన కెరీర్ లో ఫస్ట్ 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకోబోతున్న సినిమాగా నిలవబోతుంది. ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలు తండేల్ తో పోల్చితే పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించడం లేదు కాబట్టి కచ్చితంగా లాంగ్ రన్ లో తండేల్ మూవీ మరింత జోరు చూపించి కలెక్షన్స్ పరంగా కుమ్మేసే లాభాలను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.