బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా, నాగ చైతన్య కి సాలిడ్ కంబ్యాక్ మూవీ గా మాస్ రచ్చ చేస్తూ ఉండగా, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక లాంటి ఏరియాల్లో సినిమా మొదటి రోజు నుండి ఎక్స్ లెంట్ గానే…
పెర్ఫార్మ్ చేస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మీద ఇప్పుడు మంచి లాభాలను సొంతం చేసుకోబోతుంది కానీ ఒక్క చోట మాత్రం సినిమాకి అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ అయితే రావడం లేదు…అదే నార్త్ అమెరికాలో…
అక్కడ రీసెంట్ గా జరిగిన ఇంసిడెంట్ ల కారణం కావొచ్చు, లేదా ఈ సినిమా జానర్ కూడా ఒక కారణం కావొచ్చు, లేదా అక్కడ సినిమాకి వచ్చిన ఎబో యావరేజ్ రేంజ్ టాక్ కావొచ్చు కానీ కలెక్షన్స్ పరంగా మిగిలిన చోట్ల కుమ్మేస్తున్న సినిమా ఇక్కడ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ని చూపించడం లేదు..
సినిమా కి టోటల్ గా ఓవర్సీస్ లో 6 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది…5 రోజుల్లో సినిమా ఓవరాల్ గా టోటల్ ఓవర్సీస్ లో 4 కోట్లకు పైగా షేర్ ని అయితే అందుకుని పర్వాలేదు అనిపించింది కానీ నార్త్ అమెరికాలో సినిమా అవలీలగా 1 మిలియన్ మార్క్ ని దాటేస్తుంది అనుకున్నా కూడా..
ఇప్పటి వరకు ఆ మార్క్ ని అందుకోలేక పోయింది. వర్కింగ్ డేస్ లో అక్కడ అనుకున్న దాని కన్నా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇక అక్కడ తేరుకుని బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం అయితే ప్రస్తుతానికి కష్టంగానే కనిపిస్తుంది. దాంతో అన్ని చోట్లా కుమ్ముతున్న సినిమాకి ఇక్కడ మాత్రం దెబ్బ పడినట్లు అయింది.