Home న్యూస్ రూల్స్ మార్చేశారు….ఏమాత్రం లెక్క చేయని థియేటర్ ఓనర్లు!

రూల్స్ మార్చేశారు….ఏమాత్రం లెక్క చేయని థియేటర్ ఓనర్లు!

0

9 నెలలుగా మూసేసి ఉన్న థియేటర్స్ కి జనాలు వస్తారో రారో అన్న డౌట్ ఉన్న నేపధ్యంలో రిస్క్ చేసి మరీ సినిమాను రిలీజ్ చేశాడు సాయి ధరం తేజ్… తను నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్రిస్టమస్ కానుకగా రిలీజ్ అవ్వగా అద్బుతమైన ఓపెనింగ్స్ తో దూసుకు పోతుంది. అదే సమయంలో సినిమా కోసం వస్తున్న జనాలను చూసి చాలా చోట్ల థియేటర్ ఓనర్లు….

సంతోషించాల్సింది పోయి అత్యాశకి పోతున్నారు… టికెట్ రేట్లు పెంచుకోవడం పెంచుకోక పోవడం థియేటర్ ఓనర్ల ఇష్టం అని ప్రభుత్వం ఆల్ రెడీ చెప్పేసింది, కానీ థియేటర్స్ లో 50% ఆక్యుపెన్సీ మాత్రమే ఉండాలి అని కూడా చెప్పగా ఆ 50% ఆక్యుపెన్సీ కోసం ఆన్ లైన్ లో…

టికెట్స్ కొనుక్కోవాలి అని కూడా చెప్పగా కొందరు థియేటర్ ఓనర్లు ఆన్ లైన్ లో వాటి సేల్స్ జరుపుతూ తర్వాత కూడా జనాలు థియేటర్ వైపు వస్తే సేఫ్టీ ని మర్చిపోయి మిగిలిన సీట్స్ లో వాళ్ళని టికెట్ తీసుకుని కూర్చో బెడుతున్నారు… ఈ విధంగా చాలా థియేటర్స్ లో జరగగా ఆ ఫోటోలు…

సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పాడంతో జనాలు వస్తారో రారో అన్నది పక్కకు పెట్టేసి మొదటి రోజు చాలా చోట్ల టికెట్ రేట్లు పెంచేశారు…ఇక రెండో రోజు నుండి వీకెండ్ మొత్తం టికెట్ రేట్లు ఇలానే పెంచి సినిమాను ఆడించబోతున్నారని సమాచారం… అసలే 9 నెలలుగా థియేటర్స్ మూతబడి ఉన్న టైం లో…

జనాలు వస్తారో రారో అన్న డౌట్ లో ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్న రేట్స్ తోనే కొద్ది కాలం అలవాటు చేయాల్సింది పోయి ఆడియన్స్ వస్తున్నారని తెలిసిన వెంటనే ఇలా రేట్లు పెంచడం షరతులను మరచి ఎక్కువ మందిని థియేటర్ లోపలి రప్పించడం లాంటివి మరింత ఇబ్బంది కలిగించే విషయాలే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here