బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి కి ఆడియన్స్ ముందుకు వచ్చిన కింగ్ నాగార్జున యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ల కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా బంగార్రాజు…. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళతో వీకెండ్ మొత్తం షేక్ చేసిన ఈ సినిమా థార్డ్ వేవ్ ఇంపాక్ట్ వలన తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో అయినా కానీ మెల్లగా పరుగును స్టడీగా కొనసాగిస్తూ మొత్తం మీద 30 రోజుల్లో ఓవరాల్ గా…
బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది, తర్వాత డిజిటల్ లో రిలీజ్ అవ్వడం వలన పరుగును పూర్తీ చేసుకుంది ఈ సినిమా, ఓవరాల్ గా టాలీవుడ్ లో బాహుబలి సిరీస్ తర్వాత సీక్వెల్స్ పరంగా హిట్ గా నిలిచిన ఒకే ఒక్క సినిమా గా….
ఈ బంగార్రాజు సినిమా నిలవడం విశేషం అని చెప్పాలి….. కానీ సినిమా కి దొరికిన సోలో రిలీజ్ కి సోగ్గాడే చిన్ని నాయన సినిమా కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తుంది అనుకున్నా థార్డ్ వేవ్ అండ్ ఆంధ్రలో రేట్స్ వలన అలాగే అక్కడ 50% ఆక్యుపెన్సీ వలన ఆ కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది….
ఇక టోటల్ రన్ లో బంగార్రాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 8.48Cr
👉Ceeded: 7.16Cr
👉UA: 5.39Cr
👉East: 4.24Cr
👉West: 2.92Cr
👉Guntur: 3.50Cr
👉Krishna: 2.30Cr
👉Nellore: 1.76Cr
AP-TG Total:- 35.75CR(58.40Cr~ Gross)
👉Ka+ROI: 1.88Cr
👉OS – 1.52Cr
Total WW: 39.15CR(66CR~ Gross)
ఇదీ ఓవరాల్ గా టోటల్ రన్ లో బంగార్రాజు సినిమా సాధించిన కలెక్షన్స్….
మొత్తం మీద సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 38.15 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా 39 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ పూర్తీ అయ్యే టైం కి 15 లక్షల దాకా ప్రాఫిట్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది, పరిస్థితులు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం ఎక్కువగా సొంతం చేసుకుని ఉండేది ఈ సినిమా..