మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి తో కెరీర్ ఆల్ టైం డిసాస్టర్ తర్వాత అరవింద సమేత తో కంబ్యాక్ ఇచ్చి ఈ ఇయర్ సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ దగ్గర అల వైకుంఠ పురం లో సినిమా తో ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ని దక్కించుకోగా ఇప్పుడు తిరిగి ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే మొదలు కావాల్సిన ఈ సినిమా….
కరోనా వలన పోస్ట్ పోన్ అవ్వగా ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ ఓ మీడియం రేంజ్ మూవీ ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే, కొంత మంది యంగ్ హీరోలతో అనుకుని రామ్ తో సినిమా ప్రాజెక్ట్ ని సెట్ చేసే పనిలో ఉన్న త్రివిక్రమ్ అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే…
ఈ సినిమాను మొదలు పెట్టె అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఇక రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు రెడ్ ని రిలీజ్ కి ఎప్పుడో రెడీ చేసినా కొత్త సినిమా కమిట్ కాలేదు కాబట్టి ఈ సినిమా ఒప్పుకునే అవకాశం…
ఎంతైనా ఉందని అంటుండగా ఈ సినిమా కోసం బడ్జెట్ కూడా 40 కోట్ల రేంజ్ లో కేటాయించారు నిర్మాతలు, ఇక ఇటు త్రివిక్రమ్ అటు రామ్ ల రెమ్యునరేషన్ లు కూడా డిసైడ్ అయ్యాయని టాక్ వస్తుంది, ఈ సినిమా కి గాను త్రివిక్రమ్ శ్రీనివాస్ 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని అంటూ ఉండగా రామ్ కూడా 7 కోట్ల రేంజ్ లో….
రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారని అంటున్నారు. ఒకవేళ ఇది నిజం అయితే ఇద్దరి రెమ్యునరేషన్ కే ఏకంగా 22 కోట్లు వెళ్ళబోతుంది, అంటే 55% వీళ్ళకే వెళ్లబోతుండగా మిగిలిన 18 కోట్ల బడ్జెట్ లో సినిమా నిర్మాణం అవ్వాల్సి ఉంటుంది, మరి ప్రాజెక్ట్ ఎప్పుడు అఫీషియల్ గా ఓకే అయ్యి సెట్స్ పైకి వెళుతుందో చూడాలి మరి.