Home TRP రేటింగ్ 16.5 కోట్లకు అమ్మితే…మహర్షి TRP రేటింగ్ ఇది!!

16.5 కోట్లకు అమ్మితే…మహర్షి TRP రేటింగ్ ఇది!!

0

     టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా గా తెరకెక్కిన సినిమా మహర్షి, సమ్మర్ బరిలో సోలో గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మహేష్ బాబు కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచిన మహర్షి టోటల్ రన్ లో ఏకంగా 104.58 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేసింది. కాగా తర్వాత సినిమా టెలివిజన్ లో త్వరగా టెలికాస్ట్ అవుతుంది అనుకున్నా లేట్ అయింది.

అప్పటికే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన మహర్షి ని రీసెంట్ గా దసరా కానుకగా టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు. సినిమా ను జెమిని టివి ఏకంగా 16.5 కోట్ల రేటు చెల్లించి శాటిలైట్ రైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాగా దసరా బరిలో టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన సినిమాకి…

షాకింగ్ TRP రేటింగ్ దక్కింది…. మహేష్ లాంగ్ మార్క్ మూవీ, ఫ్యామిలీ కంటెంట్, పండగ టైం లో టెలికాస్ట్ అవ్వడం తో మినిమం 15 రేంజ్ కి తగ్గని TRP రేటింగ్ ని సినిమా సొంతం చేసుకుంటుంది అనుకున్నా అందరికీ షాక్ ఇస్తూ సినిమా కేవలం 9.2 TRP రేటింగ్ ని మాత్రమె సొంతం చేసుకుంది.

ఇది చానెల్ కి అందరికీ మామూలు షాక్ కాదనే చెప్పాలి. అప్పటికే స్ట్రీమింగ్ అయి ఉండటం, పండగ టైం లో అందరు బయట ఉండటం లాంటి కారణాలు ఎన్ని చెప్పుకున్నా ఫైనల్ గా TRP రేటింగ్ పరంగా మొదటి సారి మహర్షి సినిమా భారీ గా నిరాశ పరిచింది అన్నది ఎవ్వరూ కాదనలేని నిజం.

ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న అప్ కమింగ్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ బరిలో వచ్చే ఇయర్ సంక్రాంతి కి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అప్పుడు పోటి లో రిలీజ్ అవుతున్నా సినిమా పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here