బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో 2 స్ట్రైట్ తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి, అల్లు శిరీష్ చాలా టైం గ్యాప్ తర్వాత చేసిన ఊర్వశివో రాక్షసివో సినిమా అలాగే సంతోష్ శోభన్ నటించిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమాలు. ఈ రెండు సినిమాలు కూడా యూత్ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు అన్న నమ్మకంతోనే రిలీజ్ అవ్వగా అడ్వాన్స్ బుకింగ్స్ 2 సినిమాలకు అసలు జరగలేదు అనే చెప్పాలి.
దాంతో మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ఈ సినిమాలు రిలీజ్ అవ్వగా లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా ఏమాత్రం ఆడియన్స్ ను అలరించ లేక పోయింది అని చెప్పాలి. ఇక ఊర్వశివో రాక్షసివో సినిమా యూత్ ని ఉన్నంతలో థియేటర్స్ కి రప్పించే విషయంలో…
కొద్ది వరకు సఫలం అవ్వగా సినిమాకి రిలీజ్ కి ముందు హైదరాబాదులో 20 లక్షల దాకా గ్రాస్ బుకింగ్స్ జరిగాయి, ఇక రిలీజ్ రోజున సినిమా ఉన్నంతలో హోల్డ్ చేసిన విధానం చూస్తూ ఉంటె 50 లక్షలకు అటూ ఇటూగా షేర్ ని మొదటి రోజు సొంతం చేసుకునే అవకాశం ఉంది…
ఇక లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా మొదటి రోజు 15-20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, మొత్తం మీద 2 సినిమాల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కల మీద ఈ కలెక్షన్స్ ని అందుకుంటాయా లేక ఇంకొంచం ఎక్కువ వసూళ్లు సాదిస్తాయా అన్నది చెప్పగలం…