పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలను కమిట్ అవుతూ ఉండగా రీసెంట్ గా సుజిత్ డైరెక్షన్ లో సినిమాను అనౌన్స్ చేయగా ఇప్పుడు హరీష్ శంకర్ తో ఆల్ రెడీ అనౌన్స్ చేసిన సినిమా ను మార్చినట్లు వార్తలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముందుగా ఈ సినిమా ను అనౌన్స్ చేసే టైం లో హరీష్ శంకర్ అఫీషియల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా భవదీయుడు భగత్ సింగ్ గా…
సినిమా టైటిల్ ని కన్ఫాం చేశారు… కానీ ఇప్పుడు అఫీషియల్ గా ఈ టైటిల్ ని మాడిఫై చేసి కొత్త టైటిల్ ని పెట్టారు…. కొత్త టైటిల్ ఉస్తాద్ భగత్ సింగ్ అని పవర్ ఫుల్ టైటిల్ పెట్టగా సినిమా టాగ్ లైన్ మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ…
పెట్టడం ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషీ చేసింది అని చెప్పాలి. ఎందుకంటే ఉస్తాద్ అనే పేరుని సోషల్ మీడియాలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ కి వాడతారు, అలాంటిది ఇప్పుడు టైటిల్ లోనే కన్ఫాం చేయడం, అలాగే రీసెంట్ టైం లో హైలెట్ అయిన మనల్ని ఎవడ్రా ఆపేది డైలాగ్ ను…
టాగ్ లైన్ గా పెట్టడం హైప్ ను మరింతగా పెంచేసింది. ఇక ఈ సినిమా తెరి(పోలీసోడు) సినిమా రీమేక్ అని వార్తలు గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి, కానీ కోర్ పాయింట్ ని తీసుకుని భారీ మార్పులతో ఫ్యాన్స్ కి కామన్ ఆడియన్స్ కి నచ్చేలా హరీష్ శంకర్ మార్చారని అంటున్నారు.. మరి ఇది ఎంతవరకు నిజమో త్వరలో తెలుస్తుంది.