లాస్ట్ ఇయర్ మహారాజ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన లేటెస్ట్ మూవీ విడుదల పార్ట్ 2(Vidudala Part 2) సినిమా లాస్ట్ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రాగా మొదటి పార్ట్ భారీ విజయం వలన…
రెండో పార్ట్ పై అంచనాలు సాలిడ్ గా పెరిగిపోయాయి. కానీ మొదటి పార్ట్ రేంజ్ లో రెండో పార్ట్ లేక పోవడంతో మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా తమిళనాడులో మాత్రం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసినా కూడా మిగిలిన చోట్ల మాత్రం…
పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. తెలుగు రాష్ట్రాలలో సినిమా 2.5 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ లో 2.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే అందుకుని డిసాస్టర్ గా రన్ ను పూర్తి చేసుకోగా…
ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Vidudala 2 Movie Total World Wide Collections Approx.
👉Tamilnadu – 38.85CR~
👉Telugu States – 2.35Cr
👉Karnataka – 2.85Cr
👉ROI – 1.60Cr
👉Overseas – 10.35Cr***approx.
Total WW collection – 56.00CR(27.65CR~ Share) Approx.
(77%~ Recovery)
మొత్తం మీద సినిమా మిక్సుడ్ టాక్ తో కూడా లాంగ్ రన్ లో బాగానే జోరు చూపించింది…సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 35 కోట్ల దాకా ఉండగా టార్గెట్ లో సినిమా 77% రేంజ్ లో రికవరీ ని సాధించగా ఓవరాల్ గా 7.7 కోట్ల రేంజ్ లో లాస్ ను అందుకుని…
యావరేజ్ కి అటూ ఇటూగా అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కొంచం బెటర్ రిజల్ట్ ను సినిమా కనుక సొంతం చేసుకుని ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా టార్గెట్ ను అందుకునే అవకాశం ఉండేది కానీ టార్గెట్ ను మిస్ చేసుకుంది సినిమా…