పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో యూత్ తిరుగు లేని క్రేజ్ ను సొంతం చేసుకున్న సెన్సేషనల్ విజయ్ దేవరకొండ, చాలా స్పీడ్ గా టైర్ 2 హీరోలలో రికార్డులు క్రియేట్ చేస్తూ అందరినీ డామినేట్ చేస్తూ ఇక టాప్ స్టార్ లీగ్ లో అడుగు పెట్టడానికి సిద్ధం అవుతున్న టైంలో…
వరుస పెట్టి ఒకటి తర్వాత ఒకటి సినిమాలు నిరాశ పరిచే రిజల్ట్ లు సొంతం చేసుకుంటూ ఉండగా ఆ ఇంపాక్ట్ ఇప్పుడు తన బాక్స్ ఆఫీస్ మార్కెట్ పై కూడా పడింది. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ కాంబోలో వచ్చిన ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie)….రీసెంట్ టైంలో నే విజయ్ దేవరకొండ కెరీర్ లో లోవేస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుంది.
ఈ సినిమా మీద ఫుల్ నమ్మకం పెట్టుకుని భారీ ప్రమోషన్స్ చేశారు హీరో, హీరోయిన్ అలాగే నిర్మాత….కానీ మొదటి రోజు ఆడియన్స్ రెస్పాన్స్ వాళ్ళకి నిరాశ పరిచింది, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది అనుకున్నారు కానీ రెండో రోజు మూడో రోజు సినిమా పరిస్థితి చూసిన తర్వాత ఇక కష్టమే అని కన్ఫాం అయింది….
6 ఏళ్ళుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ఇక టాప్ స్టార్ కేటగిరీలోకి వెళ్ళడానికి ఒకటి రెండు మంచి హిట్స్ సరిపోతాయి అనుకున్నా ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ తో మళ్ళీ ఒక్కో మెట్టు ఎక్కి తన స్టామినాని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది….కెరీర్ మొదట్లో లో అయినంత స్ట్రగుల్ ఇప్పుడు అవసరం లేదు కానీ…
మరొక్క సారి అర్జున్ రెడ్డి-గీత గోవిందం లాంటి ఒకటి రెండు నికార్సయిన హిట్స్ ఇప్పుడు విజయ్ చాలా చాలా అవసరం అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితి ఒక టైంలో ఇతర హీరోలకు కూడా వచ్చాయి, వాళ్ళతో పోల్చితే పెద్దగా స్టార్ బ్యాగ్రౌండ్ లేని విజయ్ కి యూత్ లో ఇప్పటికీ మంచి క్రేజ్ అయితే ఉందని చెప్పొచ్చు…
కావాల్సింది అల్లా ఒక మంచి హిట్ మూవీ, తన నటన పై కూడా మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉండగా తన అప్ కమింగ్ మూవీ పై మరింత శ్రద్ధ తీసుకుని ఎలాంటి వంక పెట్టడానికి ఛాన్స్ లేని సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సక్సెస్ అయితే తిరిగి మీడియం రేంజ్ హీరోలలో తన రేంజ్ ని నిరూపించుకోవచ్చు… మరి అలాంటి హిట్ త్వరగా తనకి సొంతం అవ్వాలని కోరుకుందాం.