Home న్యూస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన సాయి ధరం తేజ్ విరూపాక్ష గ్లిమ్స్ టాక్…పాన్ ఇండియా...

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన సాయి ధరం తేజ్ విరూపాక్ష గ్లిమ్స్ టాక్…పాన్ ఇండియా ఫిల్మ్!

0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిపబ్లిక్ సినిమాతో నిరాశ కలిగించే రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఓ డిఫెరెంట్ అటెంప్ట్ గా చేస్తున్న కొత్త సినిమా విరూపాక్ష, రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ను రివీల్ చేయగా ఈ సినిమా టైటిల్ ను అఫీషియల్ గా విరూపాక్షగా కన్ఫాం చేశారు. గ్లిమ్స్ క్లాలిటీ….

అదుర్స్ అనిపించే విధంగా ఉండగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో గ్లిమ్స్ రేంజ్ మరో రేంజ్ కి వెళ్ళిపోయింది అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా ఊర్లో కొన్ని మూడ నమ్మకాలకు సంభందించినట్లు అనిపిస్తూ ఉండగా వాటిని హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా అనిపిస్తుంది…

సినిమా గ్లిమ్స్ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో డైలాగ్స్ ని గమనిస్తే… “అజ్ఞానం భయానికి మూలం, భయం మూడ నమ్మకానికి కారణం, ఆ నమ్మకమే నిజం అయినప్పుడు, ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు, అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం విరూపాక్ష” అంటూ గ్లిమ్స్ డైలాగ్ ఉండటం…

సాయి ధరం తేజ్ లుక్ చివర్లో చూపించగా ఆ లుక్ కూడా ఆకట్టుకోవడం, ఓవరాల్ టీసర్ క్వాలిటీ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించాగా సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నట్లు కన్ఫాం చేయగా వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 21న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తెలియజేశారు. మరి ఈ సినిమాతో సాయి ధరం తేజ్ ఏ రేంజ్ హిట్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here