కొందరి కెరీర్ ఒక్క సినిమా తో ఓ రేంజ్ లో టర్న్ తీసుకుంటుంది, అలాంటి టర్న్ నే ఒక్క సినిమా తో సొంతం చేసుకున్న హీరోగా మెగా ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అయిన కొత్త హీరో పంజా వైష్ణవ్ తేజ్ నిలుస్తాడు అని చెప్పాలి. ఉప్పెన అనే ఒక ఒక్క సినిమా తన కెరీర్ ని మార్చేసింది, కెరీర్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఫస్ట్ సినిమాకే రావడం తో వైష్ణవ్ తేజ్ కి…
వరుస పెట్టి ఆఫర్స్ అన్ని వైపులా వస్తూ ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఉప్పెన 21 కోట్ల టార్గెట్ కి ఏకంగా 51 కోట్లకు పైగా షేర్ ని సాధించి ఏకంగా 30 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఈ సినిమా కి కేవలం 50 లక్షల రేంజ్ లో…
మాత్రమే రెమ్యునరేషన్ ని సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ తర్వాత కొండపాలెం సినిమా కి 2 కోట్ల మేర రెమ్యునరేషన్ ని తీసుకోగా తర్వాత మరో 2 కొత్త సినిమాలను కమిట్ అయిన వైష్ణవ్ తేజ్ ఇప్పుడు అందులో ఒక సినిమా కి ఏకంగా 5 కోట్ల రేంజ్ లో…
రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నాడు అనేది టాలీవుడ్ లేటెస్ట్ టాక్, ఆ రేంజ్ రెమ్యునరేషన్ అంటే మీడియం రేంజ్ హీరోల లెవల్ లో ఉండే రెమ్యునరేషన్ అని చెప్పాలి. కానీ ఒక్క సినిమా సాధించిన అల్టిమేట్ విజయం తోనే ఈ రెమ్యునరేషన్ ఆఫర్ ని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. తన అప్ కమింగ్ మూవీ కొండపాలెం పై కూడా…
ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న వైష్ణవ్ తేజ్ ఆ సినిమా కూడా సక్సెస్ అయితే తన రేంజ్ మరింత పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఆ సినిమా త్వరలోనే పరిస్థితులు నార్మల్ అయ్యాక ఆడియన్స్ ముందుకు వస్తుందని సమాచారం. ఇక రెమ్యునరేషన్ సాలిడ్ గా పెంచుకున్న వైష్ణవ్ తేజ్ తన అప్ కమింగ్ మూవీస్ తో ఉప్పెన రేంజ్ న్యాయం చేస్తాడో లేదో చూడాలి.