Home న్యూస్ విశ్వంభర 1st సాంగ్ రామ రామ రివ్యూ….కుమ్మింది సాంగ్!!

విశ్వంభర 1st సాంగ్ రామ రామ రివ్యూ….కుమ్మింది సాంగ్!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర(Vishwambhara) సినిమా ఆడియన్స్ ముందుకు ఈ పాటి కే రిలీజ్ అవ్వాల్సింది కానీ పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు జులై లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద అంచనాలు ముందుతో పోల్చితే…

ఇప్పుడు కొంచం తగ్గినా కూడా మెగాస్టార్ క్రేజ్ పవర్ తో రిలీజ్ టైంకి అన్నీ అవే సెట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ఇక రీసెంట్ గా హనుమాన్ జయంతి సందర్భంగా సినిమా ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయగా రామ రామ అంటూ లిరిక్ తో తెరకెక్కిన ఈ సాంగ్ ఫస్ట్ హియరింగ్ లోనే…

బాగానే ఇంప్రెస్ చేసింది అని చెప్పాలి…లిరిక్స్ అండ్ మ్యూజిక్ సాంగ్ కి బాగా సెట్ అయ్యేలా ఉండగా అదే టైంలో మెగాస్టార్ లుక్స్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే ఎక్స్ లెంట్ గా మెప్పించాయి అని చెప్పాలి…ఇక రాముడి మీద పాడిన పాట లిరిక్స్ కూడా మెస్మరైజ్ చేయగా..

ఎం ఎం కీరవాణి తన మ్యూజిక్ తో మరోసారి మెప్పించడం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా ఫస్ట్ హియరింగ్ లోనే సినిమా ఈ సాంగ్ పర్వాలేదు అనిపించేలా మెప్పించగా రిపీట్స్ లో బాగానే ఇంప్రెస్ చేసింది అని చెప్పాలి.

దాంతో సినిమా మీద తగ్గిన అంచనాలు మెల్లిగా పెరుగుతూ తిరిగి సినిమా మీద హోప్స్ అయితే పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. ఇక సాంగ్ కి మొదటి 24 గంటల్లో ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుంది అన్నది ఆసక్తిగా మారింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here