Home న్యూస్ అమ్మింది 73 కోట్లకు…3 వారాల్లో వచ్చింది ఇది!!

అమ్మింది 73 కోట్లకు…3 వారాల్లో వచ్చింది ఇది!!

0

     కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విశ్వాసం బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి రేసు లో నిలిచిన విషయం తెలిసిందే. సినిమా ఏకంగా సూపర్ స్టార్ రజినీ నటించిన పేట సినిమా కి పోటిగా రిలీజ్ అవ్వగా మిగిలిన చోట్ల రజినీ పేట లీడ్ లో ఉన్నా కానీ అజిత్ కుమార్ విశ్వాసం మాత్రం తమిళనాడు లో సూపర్ గా హోల్డ్ చేసి సంక్రాంతి కి సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది.

తర్వాత కూడా ఏమాత్రం స్లో డౌన్ అవ్వకుండా అద్బుతమైన కలెక్షన్స్ ని కలెక్ట్ చేస్తూ మొత్తం మీద మూడు వారాలకు పూర్తీ చేసుకుంది, సినిమా పై ఉన్న క్రేజ్ అండ్ ప్రస్తుతం సినిమా హోల్డ్ చేస్తున్న విధానం చూస్తుంటే సినిమా లాంగ్ రన్ లో మరిన్ని కలెక్షన్స్ ని…

అందుకుని దుమ్ము లేపడం ఖాయం అంటున్నారు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.. Tamil Nadu – 125.5 Cr, Karnataka – 11.3 Cr, Kerala – 4.15 Cr, ROI – 3.3 Cr, Overseas – 39.6 Cr Total worldwide gross 184 Cr…

సినిమాను టోటల్ గా 73 కోట్లకు అన్ని చోట్లా కలిపి అమ్మగా సినిమా మొత్తం మీద 74 కోట్ల రేంజ్ లో షేర్ టార్గెట్ తో అలాగే 140 కోట్ల రేంజ్ లో గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 వారాలు పూర్తీ అయ్యే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర 95 కోట్ల వరకు..

షేర్ ని అందుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచి 22 కోట్ల రేంజ్ లో లాభాలను సొంతం చేసుకుంది. ఇక సినిమా మరో వారం 10 రోజులు ఇదే జోరు కొనసాగిస్తే 100 కోట్ల షేర్ తో పాటు 200 కోట్ల గ్రాస్ రికార్డ్ కు కూడా చేరువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here