సంక్రాంతి సీజన్ సెలవులు కంప్లీట్ గా అయిపోయాయి.. బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు సిసలు వర్కింగ్ డే సోమవారం అన్ని సినిమాలు ఫుల్ గా ఎదురుకోగా ఏ సినిమా లీడ్ లో ఉంది అన్నది ఆసక్తిగా మారగా ముందుగా సంక్రాంతి రేసులో అన్ని సినిమాల కన్నా కూడా ముందుగా రిలీజ్ అయిన నట సింహం బాలయ్య మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే లో పూర్తిగా తేలిపోయింది.
ఏమాత్రం జోరు చూపలేక మినిమమ్ కలెక్షన్స్ తో కూడా హోల్డ్ చేయలేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 వ రోజు అన్ని ఏరియాలలో ఆల్ మోస్ట్ వాష్ అవుట్ అయిందనే చెప్పాలి, ఓవరాల్ షేర్ 5 నుండి 10 లక్షల లోపే ఉండే అవకాశం ఉంది.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులలో మాగ్జిమం కలెక్షన్స్ తో మొదటి 8 రోజులు ఎంజాయ్ చేసినప్పటికీ తర్వాత రెండు రోజుల్లో తేలిపోయింది, ఇక వర్కింగ్ డే అయిన 11 వ రోజున కూడా సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా జోరు చూపలేక పోయింది, నైజాం లో వీక్ గా ఉండగా వైజాగ్ లో కొంచం జోరు చూపింది, మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజున రెండు రాష్ట్రాలలో 40 లక్షల నుండి 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉంది.
ఇక సంక్రాంతి రేసులో చివరగా వచ్చిన F2 9 రోజుల పాటు ఓ రేంజ్ ఊచకోత కోయగా 10 వ రోజు వర్కింగ్ డే అయినా కానీ మిగిలిన సినిమాల తో పోల్చితే అద్బుతంగా హోల్డ్ చేసి రోజుని 2 కోట్ల రేంజ్ లో ముగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి అఫీషియల్ ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.
ne cheppa f2
mathram hittu avuthundhi