కింగ్ నాగార్జున బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపి చాలా టైం అవుతుంది, ముఖ్యంగా రీసెంట్ మూవీస్ అన్నీ కూడా పూర్తిగా నిరాశ పరిచాయి, ఆఫీసర్, మన్మథుడు 2 లాంటి సినిమాలు ఎంతలా నిరాశ పరిచాయో అందరికీ తెలిసిందే, దాంతో నాగార్జునన ఒక మాస్ మూవీ తో కంబ్యాక్ ఇవ్వాలని అంతా కోరుకున్నారు కానీ కింగ్ నాగార్జున మరో ఎక్స్ పెరిమెంటల్ మూవీ ని ఓకే చేసి అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఆ సినిమానే వైల్డ్ డాగ్…
మొదటి నుండి ఈ సినిమా పై పెద్దగా అంచనాలు అయితే లేవు, ఆఫీసర్ మూవీ పోలికలే కొన్ని పోస్టర్స్ తో కనిపించడంతో సినిమా పై పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు, ఇక సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కాబోతుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి.
కానీ వాటికి నాగ్ జవాబు చెబుతూ సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ కాబోతుందని కన్ఫాం చేయగా రీసెంట్ గా సినిమా ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు, ట్రైలర్ చూశాక ఒక్కసారిగా సినిమా పై ఉన్న ఇంప్రెషన్ మొత్తం మారిపోయింది అని చెప్పొచ్చు.
బాలీవుడ్ ఉరి సినిమా రేంజ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్, గ్రాండ్ విజువల్స్, మేస్మరైజింగ్ యాక్షన్ సీన్స్, నాగార్జున మాస్ యాటిట్యూడ్ ఇలా ట్రైలర్ మొత్తం అంచనాలను మించే విధంగా ఇంప్రెస్ చేసింది, దాంతో ఇప్పుడు సినిమా పై ఎక్స్ పెర్టేషన్స్ సాలిడ్ గా పెరిగాయి అని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ కి కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది మొదటి 24 గంటల్లో…
టోటల్ గా 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి ఈ ట్రైలర్ కి యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ 3.41 మిలియన్ మార్క్ ని అందుకోగా లైక్స్ 118.2K మార్క్ ని అందుకుంది. ఇది సాలిడ్ రెస్పాన్స్ అనే చెప్పాలి. ఓవరాల్ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచగా ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ కి తెలుగు లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరం. ఏప్రిల్ 2 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక..