టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మెగాస్టార్ కెరీర్ లో తిరుగు లేని కంబ్యాక్ మూవీగా నిలిచి సంచలనం సృష్టించగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రన్ ని ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది. ఒక్కో ఏరియాలో సినిమా బాక్స్ ఆఫీస్ పరుగు కంప్లీట్ అవుతూ ఉండగా సినిమా ముందుగా నైజాం ఏరియాలో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రన్…
ఆల్ మోస్ట్ ఎండ్ అయ్యింది. ఇది వరకే ఎండ్ అయినట్లే అనిపించినా కొత్త సినిమాల రిలీజ్ లు పండగల అడ్వాంటేజ్ ల వలన సినిమా తిరిగి కొంత వరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా నైజాం ఏరియాలో సినిమా డబుల్ ప్రాఫిట్స్ తో ఊచకోత కోసింది అని చెప్పాలి.
సినిమా ను నైజాం ఏరియాలో మొత్తం మీద 18 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ కి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి 36.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును ఆల్ మోస్ట్ పూర్తీ చేసుకుంది ఇప్పుడు…
అంటే సినిమా బిజినెస్ మీద డబుల్ ప్రాఫిట్స్ అంటే 18.25 కోట్ల రేంజ్ ప్రాఫిట్స్ తో ఎపిక్ ప్రాఫిటబుల్ మూవీగా నిలిచింది. మిగిలిన ఏరియాలతో పోల్చితే ఈ ఏరియాలో లాభాలు నెక్స్ట్ లెవల్ లో ఊచకోత కోయడం విశేషం…. మెగాస్టార్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ గా నిలిచింది ఈ సినిమా…