Home న్యూస్ కన్నడ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన యువరత్న….ఈ రేంజ్ రేటు ఏంటి సామి!!

కన్నడ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన యువరత్న….ఈ రేంజ్ రేటు ఏంటి సామి!!

0

సౌత్ ఇండస్ట్రీలలో ఇది వరకు ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే చిన్న ఇండస్ట్రీగా కన్నడ ఇండస్ట్రీ ని అనే వారు కానీ అక్కడ కొన్ని సినిమాలు భారీ విజయాలను సాధించడం, ఎప్పుడూ ఇతర సౌత్ మూవీస్ కి కూడా భారీ కలెక్షన్స్ వస్తూ ఉండటం తో కన్నడ ఇండస్ట్రీ ఎదుగుతూ రాగా KGF మూవీ తో కన్నడ ఇండస్ట్రీ రేంజ్ అమాంతం పెరిగి పోయింది, అప్పటి వరకు కన్నడ రాష్ట్రానికే పరిమితం అయిన సినిమాలు తర్వాత ఇతర ఇండస్ట్రీలను కూడా…

పాకడం మొదలు పెట్టగా ఈ మధ్య కన్నడ సినిమాలకు బిజినెస్ లు, శాటిలైట్ రైట్స్ మరియు డిజిటల్ రైట్స్ కూడా రికార్డ్ లెవల్ రేటు ని సొంతం చేసుకుంటున్నాయి. కన్నడ సినిమాల పరంగా డిజిటల్ రైట్స్ అత్యధిక రేటు సొంతం చేసుకున్న సినిమాగా…

KGF సినిమా నిలిచింది, అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా కి 18 కోట్ల భారీ రేటు సొంతం అయినట్లు సమాచారం. ఈ రికార్డ్ మూడేళ్ళుగా అలానే కొనసాగుతూ వస్తుండగా ఇప్పుడు ఆ రికార్డ్ ను లేటెస్ట్ గా రిలీజ్ అయిన అక్కడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన యువరత్న సినిమా…

బ్రేక్ చేసి సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మరుసటి రోజు నుండే 50% లిమిటేషన్ లు పెట్టడం తో కలెక్షన్స్ కి ఆ ఇంపాక్ట్ తీవ్రంగా పడగా ఏం చేయాలో తోచని టైం లో ఈ సినిమాను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఏకంగా రిలీజ్ అయిన 9 వ రోజునే సినిమాను డిజిటల్ లో…

రిలీజ్ చేయగా ఏకంగా 25 కోట్ల భారీ రేటు ని ఈ సినిమాకి అన్ని భాషల వర్షన్స్ తో కలిపి ఇచ్చారు. దాంతో KGF సినిమా పేరిట ఉన్న రికార్డ్ ను ఈ సినిమా బ్రేక్ చేసి కన్నడ సినిమాల్లో అత్యధిక డిజిటల్ రేటు ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది, బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగు ఎఫెక్ట్ అయినా ఈ రేటు తో అందరూ లాభాల్లో ఉన్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here