Home న్యూస్ 125 కోట్ల బడ్జెట్…బ్లాక్ బస్టర్ రీమేక్….13 రోజుల్లో వచ్చింది ఇది!!

125 కోట్ల బడ్జెట్…బ్లాక్ బస్టర్ రీమేక్….13 రోజుల్లో వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీమేక్ లు పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు అని తెలిసినా కూడా బాలీవుడ్ నిర్మాతలు మాత్రం భారీ బడ్జెట్ తో రీమేక్ లు చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు…లేటెస్ట్ గా అట్లీ నిర్మాతగా మారి తీసిన యంగ్ హీరో వరుణ్ ధవన్(Varun Dhawan) నటించిన బేబీ జాన్(Baby John Movie) మూవీ….

2014 లో వచ్చిన విజయ్ బ్లాక్ బస్టర్ తెరీ రీమేక్ గా రూపొందగా సాలిడ్ ప్రమోషన్స్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయ్యింది. వరుణ్ ధవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా ఈ సినిమా నిలుస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు… సినిమా ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో….

రెస్పాన్స్ అలాగే డీసెంట్ రివ్యూలు కూడా సొంతం అయ్యాయి కూడా… కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా మినిమమ్ ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు ఎపిక్ డిసాస్టర్ గా నిలవడం ఖాయంగా మారింది.

ఆల్ మోస్ట్ సినిమా కోసం 125 కోట్ల రేంజ్ లో బడ్జెట్ పెట్టినట్లు బాలీవుడ్ లో టాక్…ఆ బడ్జెట్ కి తోడూ భారీ ప్రమోషన్స్ ను కూడా జరుపుకున్న ఈ సినిమా మొదటి రోజే 25 కోట్ల నుండి లెక్క మొదలు అవుతుంది అనుకున్నా కూడా కేవలం 11 కోట్ల రేంజ్ లో ఓపెన్ అయిన సినిమా…

వీకెండ్ తర్వాత మినిమమ్ ఇంపాక్ట్ ను చూపించ లేదు. ఇక రెండో వీక్ లో సగానికి పైగా థియేటర్స్ నుండి సినిమాను తీశేశారు. దాంతో కలెక్షన్స్ మరింతగా తగ్గిపోగా ఇప్పుడు 13 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా ఇండియా లో కేవలం 40 కోట్ల లోపే నెట్ కలెక్షన్స్ ని..

సొంతం చేసుకుని అత్యంత తీవ్రంగా నిరాశ పరిచింది. ఓవరాల్ గా షేర్ 20 కోట్ల లోపే ఉండే అవకాశం ఉండటంతో బడ్జెట్ ప్రకారం చూసుకుంటే భారీ నష్టాలతో సినిమా దారుణంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. లాంగ్ రన్ లో తేరుకునే అవకాశం కూడా లేక పోవడంతో ఆల్ మోస్ట్ రన్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసినట్లే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here