సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ ఎపిక్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie)ఊరమాస్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ ఇండియన్ మూవీస్ పరంగా ఫాస్టెస్ట్ రికార్డులతో మెంటల్ మాస్ జాతర సృష్టిస్తుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మరో ఫాస్టెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఆల్ టైం ఫాస్టెస్ట్ 1600 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు. సినిమా 22వ రోజు వర్కింగ్ డే లో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో…
1.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా హిందీలో 11-12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక తమిళ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో సినిమా 80 లక్షల లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా…
డీసెంట్ హోల్డ్ ఇంపాక్ట్ తో వరల్డ్ వైడ్ గా 22వ రోజున 16.5-17 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. దాంతో ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా వరల్డ్ వైడ్ గా 22 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 320 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటబోతూ ఉండగా…
వరల్డ్ వైడ్ గా సినిమా ఆల్ టైం ఫాస్టెస్ట్ 1600 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని 1610 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోబోతుంది. ఇండియన్ మూవీస్ లో బాహుబలి2 మూవీ 32 రోజుల్లో 1600 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా….
ఇప్పుడు కేవలం 22 రోజులు పూర్తి అయ్యే టైంకి పుష్ప2 మూవీ 1600 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండగా ఇక మిగిలిన రన్ లో ఇదే జోరుని కొనసాగిస్తే మరిన్ని రికార్డులు నమోదు చేయడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు….
Kerala record kuda bibathsame thriple disaster 🤣🤣🤣🤣🤣