టాలీవుడ్ హీరోలలో ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎక్స్ లెంట్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కి మంచి పేరు ఉండగా లాస్ట్ ఇయర్ సైంధవ్ లాంటి సీరియస్ మూవీతో సంక్రాంతికి వచ్చినా అంచనాలను అందుకోలేక డిసాస్టర్ అవ్వగా ఇప్పుడు అదే సంక్రాంతికి మళ్ళీ ఆడియన్స్ ముందుకు….
అనిల్ రావిపూడి తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమాతో వచ్చి కలెక్షన్స్ పరంగా మాస్ భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండగా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 142.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా…
ఇప్పుడు 6వ రోజున మరోసారి అన్ని చోట్లా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ దుమ్ము లేపిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల నుండే మరోసారి 19-20 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా కూడా కుమ్మేస్తున్న సినిమా ఓవరాల్ గా 24-25 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా…
గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది. ఈ కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 129-130 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని అందుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 165-166 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకోబోతుంది…విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఇవి ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ లెక్క…
ఇది వరకు ఎఫ్2 మూవీ టోటల్ రన్ లో 144 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా షేర్ పరంగా 84.51 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇప్పుడు అటు షేర్ ని ఇటు గ్రాస్ ను కూడా కేవలం 6 రోజుల గ్యాప్ లోనే అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ వెంకటేష్ కెరీర్ లో…
ఆల్ టైం బిగ్గెస్ట్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేయగా ఇక లాంగ్ రన్ లో వెంకీ కెరీర్ లో మొట్ట మొదటి 100 కోట్ల షేర్ ని అలాగే 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతున్న సినిమాగా నిలవబోతుంది…ఇక టోటల్ గా 6 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.