Home న్యూస్ హీరో ఫస్ట్ డే కలెక్షన్స్….ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే!

హీరో ఫస్ట్ డే కలెక్షన్స్….ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే!

0

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అయిన లేటెస్ట్ మూవీ హీరో బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా గురించిన బిజినెస్ డీటైల్స్ ఏవి కూడా మేకర్స్ రిలీజ్ చేయలేదు, త్వరలోనే ఫుల్ డీటైల్స్ వచ్చాక బిజినెస్ డీటైల్స్ ని అప్ డేట్ చేస్తాం. ఇక సినిమా లిమిటెడ్ రిలీజ్ ను సొంతం చేసుకున్నా కానీ ఉన్నంతలో మంచి ఆక్యుపెన్సీని చాలా చోట్ల సినిమా సొంతం చేసుకుంది…

కానీ కొన్ని చోట్ల ఆక్యుపెన్సీ తక్కువగా ఉండగా థియేటర్స్ కౌంట్ కూడా తక్కువే అవ్వడంతో సినిమా మొత్తం మీద మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 20-25% ఆక్యుపెన్సీ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి 35% వరకు ఆక్యుపెన్సీ ఉందని చెప్పాలి.

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 50 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే లెక్క 55 లక్షల నుండి 60 లక్షలకు వెళ్ళొచ్చు. మరి సినిమా అఫీషియల్ గా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here