Home న్యూస్ 2nd DAY బంగార్రాజు కలెక్షన్స్…ఊరమాస్ బ్యాటింగ్!

2nd DAY బంగార్రాజు కలెక్షన్స్…ఊరమాస్ బ్యాటింగ్!

6163
0

కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. తొలిరోజు అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో ఇటు నాగ చైతన్య కెరీర్ లో అటు నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుని సంచలనం సృష్టించిన బంగార్రాజు సినిమా 17 కోట్ల గ్రాస్ మార్క్ ని మొదటి రోజు…

సొంతం చేసుకుని దుమ్ము దులిపేయగా ఇప్పుడు రెండో రోజులో అడుగు పెట్టిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి ఎక్స్ ట్రా ఆర్డినరీ హోల్డ్ తో దుమ్ము లేపుతుంది. సినిమా రెండో రోజు మార్నింగ్ షోలకు డ్రాప్స్ కొంచం ఎక్కువగానే కనిపించినా కానీ మ్యాట్నీ షోల నుండి..

బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం మొదలు పెట్టిన బంగార్రాజు నైజాంలో కూడా మ్యాట్నీల నుండి మంచి హోల్డ్ ని అందుకుంది, కానీ మిగిలిన ఏరియాలతో పోల్చితే నైజాం హోల్డ్ మరీ అనుకున్న రేంజ్ లో లేదు, కానీ థియేటర్స్ లో ఆక్యుపెన్సీ మాత్రం బాగుంది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 5 కోట్ల మార్క్ ని మినిమమ్ వసూల్ చేయడం ఖాయమని చెప్పాలి. ఇక అన్ని చోట్లా లెక్కలు అంచనాలను మించే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో సినిమా 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అంతకుమించి కలెక్షన్స్ ని…

కనుక సినిమా సొంతం చేసుకుంటే ఊహకందని మాస్ కలెక్షన్స్ అనే చెప్పాలి. ఓవర్సీస్ లో ప్రింట్స్ లేట్ గా వెళ్ళడం లాంటివి అక్కడ కలెక్షన్స్ పై కొంచం ఇంపాక్ట్ చూపాయి. ఓవరాల్ గా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 6.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవచ్చు. ఇక అఫీషియల్ కలెక్షన్స్ లెక్క అంచనాలను అందుకుంటుందో లేక మించిపోతుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here