Home న్యూస్ కొండపొలం ఫస్ట్ డే ఓపెనింగ్స్….మైండ్ బ్లాంక్ అయ్యే షాకిది!

కొండపొలం ఫస్ట్ డే ఓపెనింగ్స్….మైండ్ బ్లాంక్ అయ్యే షాకిది!

4584
0

ఉప్పెన సినిమా తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొండ పొలం వరల్డ్ వైడ్ గా 720 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చింది, సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాలలో ఆల్ రెడీ మొదలు అయ్యి మూడు రోజుల పైనే అవుతున్నా బుకింగ్స్ అనుకున్న రేంజ్ లో అయితే జరగలేదు అనే చెప్పాలి.

దాంతో మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చిన కొండ పొలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా నైజాంలో 15% రేంజ్ ఆక్యుపెన్సీతో ఓపెన్ అవ్వగా హైదరాబాదులో 25% వరకు బుకింగ్స్ ఉన్నాయి. ఆంధ్ర రీజన్ లో ఇంకా 50% లిమిటేషన్స్ ఉండటంతో…

కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులతో కనిపించిన సినిమా సీడెడ్ లో యావరేజ్ బుకింగ్స్ జరిగాయి, దాంతో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు కొంచం షాక్ తగిలేలా ఓపెన్ అయినా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా ఇంప్రూవ్ మెంట్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది…

కానీ ప్రెజెంట్ ఓపెనింగ్స్ ని బట్టి చూస్తుంటే సినిమా 70 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకునేలా కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా పొజిషన్ ఎంతవరకు మారుతుంది అన్నది ఆసక్తి కరం, కానీ బుకింగ్స్ మెల్లి మెల్లిగా ఇంప్రూవ్ అవుతున్నట్లు కనిపిస్తున్న నేపధ్యంలో అంతా అనుకున్నట్లు జరిగితే సినిమా మొదటి రోజు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర…

90 లక్షల నుండి 1 కోటి రేంజ్ ఓపెనింగ్స్ ను అందుకునేలా ఉందని చెప్పాలి. కానీ సినిమా అంతకన్నా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి రోజు ముగిసే సరికి సినిమా ఇంకా ఏమైనా ఇంప్రూవ్ మెంట్ ను సొంతం చేసుకుని ఇంతకన్నా ముందుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా లేదా అన్నది నైట్ షోల టైం కి అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here