బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో సెకెండ్ వేవ్ తర్వాత ఫస్ట్ టైం 100% ఆక్యుపెన్సీ తో రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ ఆపరేట్ చేస్తున్నాయి. ఆంధ్రలో చాలా థియేటర్స్ 100% ఆక్యుపెన్సీతోనే రన్ అవుతున్న కలెక్షన్స్ మాత్రం 50% వె చెప్పడంతో కొన్ని సినిమాలకు ఇబ్బంది అవ్వగా ఇప్పుడు 100% ఉండటంతో ఈ అడ్వాంటేజ్ ను శర్వానంద్ మరియు సిద్దార్థ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మహా సముద్రం భారీ ఎత్తున వాడుకోవడానికి….
సిద్ధం అయ్యి తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు మంచి ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా కనిపిస్తుంది, మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 35% వరకు బుకింగ్స్ కనిపించిన సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా…
సాలిడ్ గానే ఉండటం తో రోజుని మొత్తం మీద మంచి కలెక్షన్స్ తో ముగించే అవకాశం కనిపిస్తుంది. సినిమా కి ఈవినింగ్ షోలకు తెలంగాణలో బతుకమ్మ పండగ వలన కొంచం ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది కానీ ఓవరాల్ గా సినిమా బాగానే ఓపెన్ అవ్వొచ్చు… ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే…
సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 3 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ను అందుకునేలా కనిపిస్తుంది అని చెప్పాలి. 14 కోట్ల టార్గెట్ దృశ్యా ఇవి సాలిడ్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. ఇక ఫస్ట్ డే ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండి షో షోకి కలెక్షన్స్ ఇంకా ఇంప్రూవ్ అయితే ఈ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు…
ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, మొత్తం మీద 3.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటే సాలిడ్ ఓపెనింగ్స్ ను సినిమా అందుకుందని చెప్పవచ్చు. ఒకవేళ అంతకన్నా ముందుకు వెళితే సెన్సేషనల్ కుమ్ముడు అనే చెప్పాలి. మరి రోజు ముగిసే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా ఉంటుంది అన్నది మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం…