బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది, సినిమా టాక్ బాగుండటం తో అడ్వాన్స్ బుకింగ్స్ స్లో గా మొదలు అయినా ఇప్పుడు మార్నింగ్ షోల తర్వాత మ్యాట్నీ షోల నుండి సినిమా గ్రోత్ షో షో కి భారీ గా పెరుగుతుందని చెప్పొచ్చు. సినిమా ఓవరాల్ గా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ 25% వరకు ఉందని చెప్పొచ్చు.
కానీ టాక్ బాగుండటం తో ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ జోరు పెరుగుతుండగా సినిమా కలెక్షన్స్ కూడా రోజు ముగిసే సరికి బాగుంటాయని చెప్పొచ్చు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ గత సినిమాల ఫలితాల వల్ల రాక్షసుడి కి అనుకున్న రేంజ్ లో జనాలు థియేటర్స్ కి రాలేదు.
దాంతో ఆ ఎఫెక్ట్ తొలి రోజు కలెక్షన్స్ పడే చాన్స్ ఉంది, మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ ని బట్టి సినిమా 1.8 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు. అడ్వాన్స్ బుకింగ్స్ బాగుండటం, ఈవినింగ్ అండ్ నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా బాగుంటే సినిమా మొదటి రోజు మొత్తం మీద…
2.2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. అంతకుమించి కూడా ముందుకు వెళ్ళే చాన్స్ ఉంది కానీ సినిమా క్లాస్ సెంటర్స్ లో చూపినంత జోరు మాస్ సెంటర్స్ లో కూడా భారీగా చూపితే తొలిరోజు సినిమా 2.5 కోట్లకు పైగా షేర్ ని..
అందుకునే అవకాశం ఉంది, మొత్తం మీద బిజినెస్ ని రికవరీ చేయాలి అంటే సినిమా మొదటి వీకెండ్ మొత్తం సాలిడ్ కలెక్షన్స్ తో సూపర్బ్ హోల్డ్ ని కొనసాగించాల్సి ఉంటుంది, మరి ఈవినింగ్ అండ్ నైట్ షోల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూసి మరో ఆర్టికల్ లో కలెక్షన్స్ అప్ డేట్ చేస్తాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.