ప్రదీప్ మాచిరాజు(pradeep machiraju) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(Akkada Ammayi Ikkada Abbayi Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయింది….డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో…
రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా కొంచం జోరు చూపెడుతుంది అనుకున్నా కూడా అలాంటిది ఏమి పెద్దగా జరగలేదు…సినిమా తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సెంటర్స్ లో జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని ఆక్యుపెన్సీ ని మాత్రమే సొంతం చేసుకోగా….
ఓవరాల్ గా బుక్ మై షో లో కనీసం 5 వేల రేంజ్ లో కూడా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోలేక పోయింది అనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 50 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…
వరల్డ్ వైడ్ గా 65 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. దాంతో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా షేర్ మొదటి రోజుకి గాను 30 లక్షల రేంజ్ లోనే సొంతం చేసుకుంది ఇప్పుడు. కానీ టాక్ కొంచం మిగిలిన సినిమాలతో పోల్చితే బెటర్ గా ఉండటం…
అలాగే ఎంటర్ టైన్ మెంట్ కూడా సినిమాలో కొంచం వర్కౌట్ అవ్వడంతో వీకెండ్ లో కొంచం గ్రోత్ ని చూపించే అవకాశం ఉంది. ఇక సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 4 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…ఆ లెక్కన సినిమా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది….