బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ తో కెరీర్ లోనే లోవేస్ట్ ఫేజ్ లో ఉన్న బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) రీసెంట్ టైంలో చేసిన సినిమాలు అన్నీ కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి…ఇక లేటెస్ట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ స్కై ఫోర్స్ రీసెంట్ గా..
రిపబ్లిక్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ అయింది..సినిమా కి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ రాగా మొదటి వారంలో సినిమా కలెక్షన్స్ పరంగా సాలిడ్ కలెక్షన్స్ ని ప్రజెంట్ అక్షయ్ కుమార్ ఉన్న ఫామ్ దృశ్యా చూసుకుంటే కుమ్మేసింది..
కానీ చాలా వరకు కలెక్షన్స్ అనేక ఆఫర్స్ లాంటివి పెట్టే టికెట్ సేల్స్ చేశారు. మొదటి రెండు రోజుల్లో అయితే ఆల్ మోస్ట్ టికెట్స్ ను ఫ్రీ గానే ఇచ్చారు. తర్వాత టికెట్ సేల్స్ లో భారీ డిస్కౌంట్ లు కూడా ఇవ్వడం లాంటివి కలిసి వచ్చి సినిమా కి మొదటి వారంలో..
94 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది. మొదటి వీకెండ్ లో 73.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ తో 21 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. కాగా ఓవరాల్ గా ట్రేడ్ లెక్కల్లో…
వచ్చిన మొదటి వారం కలెక్షన్స్ లో సగం వరకు కలెక్షన్స్ ఆఫర్స్ లాంటివి పెట్టి పంచిన కలెక్షన్స్ అనే అంటున్నారు…ఓవరాల్ గా సినిమాతో అక్షయ్ కుమార్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు అని అంటున్నారు కానీ అది కార్పోరేట్ బుకింగ్స్ హెల్ప్ తో…
కలెక్షన్స్ పరంగా బూస్టప్ ను సొంతం చేసుకుని ఈ వసూళ్ళని అందుకున్నాడు అని అంటున్నారు… ఓవరాల్ గా సినిమా కలెక్షన్స్ ఈ వీకెండ్ లో 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోబోతుండగా మిగిలిన రన్ లో ఎలాంటి వసూళ్ళని అందుకుంటుందో చూడాలి.