అక్కినేని అఖిల్ మరియు పూజా హెగ్డేల కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా టైం లో రిలీజ్ అవ్వగా సినిమా పై అంచనాలు సాలిడ్ గా ఉండగా బిజినెస్ కూడా బాగా జరిగింది, సినిమా ఓవర్సీస్ లో కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ అవ్వగా మొత్తం మీద అక్కడ 60 లక్షల రేటు కి సినిమాను అమ్మారు.
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి USA లో $536K మార్క్ ని అందుకుంది. అంటే ఇండియన్ కరెన్సీలో…
ఆల్ మోస్ట్ 4 కోట్లు అన్నమాట. టోటల్ ఓవర్సీస్ మొత్తం మీద పరుగు కంప్లీట్ అయ్యే టైం కి 4.8 కోట్ల గ్రాస్ ను అందుకోగా టోటల్ షేర్ 2.5 కోట్ల దాకా వచ్చింది. అంటే 60 లక్షల బిజినెస్ కి 80 లక్షలు టార్గెట్ అనుకున్నా ఇంకా 1.7 కోట్ల మేర లాభాన్ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా.