ఊహకందని కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) మూడో వీక్ వర్కింగ్ డేస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ ఉండగా ఇప్పుడు మూడు వారాలను రిమార్కబుల్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా…
20వ రోజున ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన పుష్ప2 మూవీ 21వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర క్రిస్టమస్ హాలిడే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఊహకందని జోరు చూపెడుతూ 21వ రోజున వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది..
సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి జోరుని చూపెడుతూ ఉండగా నిన్నటి మీద గ్రోత్ ని చూపెడుతున్న సినిమా మొత్తం మీద 21వ రోజున ఇప్పుడు 2-2.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇక సినిమా కర్ణాటక, తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా పుష్ప2 మంచి జోరుని చూపెడుతూ ఉండగా ఈ రోజు ఓవరాల్ గా 1 కోటి రేంజ్ లో షేర్ ని మినిమమ్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి…
ఇక హిందీలో సినిమా ఈ రోజు సాలిడ్ జోరు చూపిస్తూ ఉండగా 15-16 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది…ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించి పోతే ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉండగా…..ఓవర్సీస్ లో కూడా సినిమా ఈ రోజు…
క్రిస్టమస్ అడ్వాంటేజ్ తో మంచి జోరుని చూపిస్తూ ఉండగా మొత్తం మీద 21వ రోజున వరల్డ్ వైడ్ గా 13.5-14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక టోటల్ గా 3 వారాల్లో సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.