Home న్యూస్ బాలీవుడ్ కి ప్రాణం పోసిన చిన్న సినిమా…ఒక్క ఆఫర్ తో 53 కోట్లు ఔట్!

బాలీవుడ్ కి ప్రాణం పోసిన చిన్న సినిమా…ఒక్క ఆఫర్ తో 53 కోట్లు ఔట్!

0

బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ ఇయర్ లో పెద్దగా జోరు ఏమి చూపించలేదు, పఠాన్ ఒక్క సినిమా మినహా మిగిలిన స్టార్స్ సినిమాలు ఏమి కూడా అంచనాలను అందుకోలేదు. మధ్యలో ది కేరళ స్టొరీ కాంట్రవర్సీలను నమ్ముకుని భారీ విజయాన్ని సాధించినా బాలీవుడ్ స్టార్స్ మాత్రం…

ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడానికి ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ అనే ఆఫర్ తో రిలీజ్ అయిన విక్కీ కౌశల్ మరియు సారా అలీ ఖాన్ ల కాంబోలో వచ్చిన జర హట్ కే, జర బచ్ కే మూవీ…

పర్వాలేదు అనిపించే రేంజ్ రివ్యూలను సొంతం చేసుకోగా బాక్స్ అఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపిస్తూ క్లీన్ హిట్ గా నిలిచింది, బడ్జెట్ కి డబుల్ వసూళ్ళని సాధించిన ఈ సినిమా 9 రోజుల్లోనే 46 కోట్లకు పైగా కలెక్షన్స్ ని హిందీలో సాధించగా…

10 వ రోజు ఆదివారం ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేస్తున్న సినిమా ఈ రోజు కలెక్షన్స్ తో 50 కోట్ల మార్క్ ని దాటాబోతుంది. 9వ రోజు ఏకంగా 5.75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా 10 వ రోజు 6.5 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు…

దాంతో 10 రోజుల్లో సినిమా ఇండియాలో 53 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని చెబుతూ ఉండటం విశేషం. చిన్న సినిమానే అయినా కూడా మంచి కలెక్షన్స్ తో హిట్ గా నిలిచిన ఈ సినిమా లాంగ్ రన్ లో కలెక్షన్స్ ని ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అలాగే ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ కి ఈ సినిమా ప్రాణం పోసిందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here