Home న్యూస్ బాలీవుడ్ ను కాపాడిన చిన్న సినిమా…ఒక్క ఆఫర్ తో కలెక్షన్స్ కుమ్మేశాయి!

బాలీవుడ్ ను కాపాడిన చిన్న సినిమా…ఒక్క ఆఫర్ తో కలెక్షన్స్ కుమ్మేశాయి!

0

బాలీవుడ్ లో రీసెంట్ టైంలో సినిమాలు అనుకున్న రేంజ్ లో అయితే పెర్ఫార్మ్ చేయడం లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. పఠాన్ మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తర్వాత ఒకటి రెండు సినిమాలు జోరు చూపించినా కానీ చాలా వరకు సినిమాలు మాత్రం అంచనాలను అందుకోలేదు. రీసెంట్ గా ది కేరళ స్టొరీ కలెక్షన్స్ పరంగా కుమ్మేసినా కూడా కాంట్రవర్సీల కారణంగానే ఎక్కువ రీచ్ ను సొంతం చేసుకుంది.

కానీ ఈ వీకెండ్ లో అక్కడ పెద్దగా అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ అయిన ఓ చిన్న సినిమా మంచి కలెక్షన్స్ తో జోరు చూపించడం విశేషం, ఆ సినిమానే ‘జరా హట్కే జర బచ్ కే’ సినిమా… సింపుల్ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా స్టొరీ పాయింట్… జాయింట్ ఫ్యామిలీ లో ఉండే హీరో హీరోయిన్స్…..

   

వేరు ఫ్యామిలీని పెట్టుకోవాలి అనుకుంటారు కానీ డబ్బులు ఉండకపోవడంతో ఒక ప్రభుత్వ పధకంని వాడుకోవాలి అని డైవర్స్ నాటకం ఆడతారు, కానీ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా స్టొరీ. చాలా సింపుల్ స్టొరీనే అయినా కూడా ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఆకట్టుకోవడంతో ఆడియన్స్ సినిమాను చూడటానికి బాగానే థియేటర్స్ కి వస్తున్నారు….

విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ ల కాంబో లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు 5.50 కోట్లు, రెండో రోజు 7.20 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని సాలిడ్ గా జోరు చూపిస్తుంది. సినిమా మేకర్స్ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడానికి ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ అనే ఆఫర్ ఇవ్వడంతో ఆడియన్స్ కి ఇది మంచి రీచ్ ను సొంతం చేసుకుని 2 రోజుల్లో 12.7 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా వీకెండ్ లో 20 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here