Home న్యూస్ 24 గంటలు ఓవర్….కల్కి ట్రైలర్ కి ఈ రెస్పాన్స్ ఊహించలేదు!

24 గంటలు ఓవర్….కల్కి ట్రైలర్ కి ఈ రెస్పాన్స్ ఊహించలేదు!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన రీసెంట్ మూవీస్ టీసర్/ట్రైలర్ లు అన్నీ కూడా యూట్యూబ్ లో సంచలన వ్యూస్ అండ్ లైక్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించాయి. ప్రభాస్ లాస్ట్ మూవీ సలార్(Salaar Trailer) అయితే రికార్డుల ఊచకోత కోసింది. అలాంటి సినిమా తర్వాత ప్రభాస్ ఏకంగా ఇప్పుడు…

తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో చేసిన కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఇక యూట్యూబ్ లో రికార్డుల దుమ్ము దుమారం ఈ ట్రైలర్ నెలకొల్పడం ఖాయమని అందరూ అనుకున్నారు..

ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో రికార్డులు సృష్టించిన మన హీరోలు వీరే!
కానీ ఓవరాల్ గా ఫాస్టెస్ట్ లైక్స్ నుండే కొంచం వెనకబడిన ఈ ట్రైలర్ ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఇటు వ్యూస్ పరంగా కానీ అటు లైక్స్ పరంగా కానీ టాప్ 5 లో కూడా ఎంటర్ కాలేక పోవడం అందరినీ ఆశ్యర్యపరిచింది అని చెప్పాలి ఇప్పుడు. సినిమా తెలుగు ట్రైలర్ కి మొత్తం మీద ఇప్పుడు 24 గంటలు పూర్తి అయ్యే టైంకి…

14.43 మిలియన్ వ్యూస్ దక్కగా లైక్స్ పరంగా 694K లైక్స్ మార్క్ ని అందుకుంది. ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నప్పటికీ కూడా బాక్ టు బాక్ రీసెంట్ మూవీస్ ట్రైలర్ లతో సంచలనం సృష్టించిన ప్రభాస్ నుండి వస్తున్న బిగ్గెస్ట్ మూవీ అవ్వడంతో ఈ సినిమా ట్రైలర్ నుండి ఇంకా ఎక్కువ రెస్పాన్స్ ను అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు…

కానీ ఓవరాల్ గా 24 గంటల్లో రికార్డులను క్రియేట్ చేయడంలో వెనకడుగు వేసిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో ఈ నెల 27న గ్రాండ్ గా రాబోతూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కచ్చితంగా దుమ్ము దుమారం లేపే రికార్డులతో ఆల్ ఇండియా వైడ్ గా భారీ రచ్చ చేసే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here