Home న్యూస్ 24 గంటలు ఓవర్….రికార్డుల బెండు తీసిన కింగ్ డం టీసర్!!

24 గంటలు ఓవర్….రికార్డుల బెండు తీసిన కింగ్ డం టీసర్!!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన రీసెంట్ మూవీస్ ఏవి కూడా అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయాయి. ఇలాంటి టైంలో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో గౌతమ్ తిన్ననూరి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డం(Kingdom Movie) తో ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా…

ఈ సినిమా అఫీషియల్ టైటిల్ టీసర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) వాయిస్ ఓవర్ ఇవ్వడంతో టీసర్ మీద హైప్ ఓ రేంజ్ లో పెరిగిపోగా…టీసర్ కూడా చాలా వరకు ఆ హైప్ ను అందుకోవడంతో ఆడియన్స్ లో సినిమా మీద క్రేజ్ ఒక్క సారిగా..

పెరిగిపోయింది అని చెప్పాలి ఇప్పుడు. మే 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీసర్ సాలిడ్ రీచ్ ను సొంతం చేసుకోగా యూట్యూబ్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా ఆల్ టైం హైయెస్ట్ వ్యూస్ ని ఇప్పుడు…

24 గంటల్లో సొంతం చేసుకుని ఈ టీసర్ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది…. లైక్స్ పరంగా కూడా కుమ్మేసిన ఈ టీసర్ 24 గంటల్లో ఆల్ టైం టాప్ 2 హైయెస్ట్ లైక్స్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోయడం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి కింగ్ డం మూవీ టీసర్ కి..

వ్యూస్ పరంగా 11.88 మిలియన్ వ్యూస్ సొంతం అయ్యి ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేయగా, లైక్స్ పరంగా 24 గంటల్లో 330.7K లైక్స్ మార్క్ ని అందుకుని మాస్ ఊచకోత కోసింది…ఓవరాల్ గా రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ టీసర్ రెస్పాన్స్ పరంగా కుమ్మేయగా…

సినిమా మీద ఉన్న అంచనాలను అమాంతం పెరిగేలా చేసింది అని చెప్పాలి. ఇదే రేంజ్ లో రెస్పాన్స్ సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటే వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ విజయ్ దేవరకొండకి సాలిడ్ రికార్డులను సొంతం అయ్యేలా చేసే అవకాశం సినిమా కి ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here