రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 4వ వీకెండ్ తర్వాత కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయింది. అయినా కానీ ఇప్పటికే సినిమా ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది.
అన్ని చోట్లా రిమార్కబుల్ హోల్డ్ తో లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన దేవర మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక సినిమా 24వ రోజు డ్రాప్ అవ్వగా 25వ రోజు మరోసారి వర్కింగ్ డే లో సినిమా..
పర్వాలేదు అనిపిస్తూ హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండగా ఓవరాల్ గా ట్రెండ్ ను చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినిమా 30 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఓవరాల్ గా 36-40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద సినిమా మరోసారి పర్వాలేదు అనిపిస్తూ హోల్డ్ ని చూపించి…
ఇప్పటికీ షేర్స్ ని రాబడుతూ ఉండటం విశేషం కాగా ఆల్ రెడీ ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వరకు లిమిటెడ్ కలెక్షన్స్ తో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 26 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.