బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో రికార్డుల బెండు తీస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, అన్ని చోట్లా దుమ్ము లేపే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లో ఇండియన్ మూవీస్ పరంగా ఏ సినిమా కూడా సాధించని రేంజ్ లో వసూళ్ళతో…
ఇప్పుడు బిగ్గెస్ట్ వసూళ్ళని సొంతం చేసుకుని పాత రికార్డుల బెండు తీసింది. మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ప్రీవియస్ ఇండియన్ రికార్డ్ మీద సాలిడ్ లీడ్ సొంతం అవ్వడం కలిసి రావడంతో రెండో రోజు కొంచం వర్కింగ్ డే వలన స్లో అయినా కూడా ఓవరాల్ గా టోటల్ 2 రోజుల…
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మాత్రం సరికొత్త రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేసింది…ఇది వరకు 2 రోజుల కలెక్షన్స్ పరంగా హైయెస్ట్ గ్రాస్ వసూళ్ళని 2017 లో వచ్చిన బాహుబలి2 మూవీ సుమారు 358 కోట్ల గ్రాస్ తో టాప్ లో ఉంది, రెండో ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ…
జస్ట్ లో 356 కోట్ల గ్రాస్ తో కొద్దిలో బాహుబలి2 రికార్డ్ ను మిస్ చేసుకుంది. కానీ ఇప్పుడు అన్ని రికార్డుల బెండు తీసిన పుష్ప2 మూవీ రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 425 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. ఒకసారి సౌత్ బిగ్గెస్ట్ మూవీస్…
టోటల్ గా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లో టాప్ సినిమాలను గమనిస్తే…
South Biggest movies 2 Days WW Collections(Gross)
👉#Pushpa2TheRule – 425CR******
👉#Baahubali2 – 358CR
👉#RRRMovie – 356CR
👉#KGFChapter2 – 293.10CR
👉#Kalki2898AD – 279.60CR
👉#Salaar – 251.15CR
ఇవి ఓవరాల్ గా సౌత్ మూవీస్ హైయెస్ట్ ఓపెనింగ్ 2 డేస్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క…ఒక్క కన్నడ మూవీ మినహా పూర్తిగా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఈ లిస్టుని డామినేట్ చేయగా ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప2 తో సరికొత్త రికార్డ్ ను నమోదు చేశాడు. ఇక మూడు రోజుల కలెక్షన్స్ పరంగా ఏ సినిమాలు టాప్ లో నిలుస్తాయో చూడాలి…