Home న్యూస్ రెండో వారం “ఎన్టీఆర్ మహానాయకుడు” థియేటర్స్ కౌంట్…ఇండస్ట్రీ షాక్!

రెండో వారం “ఎన్టీఆర్ మహానాయకుడు” థియేటర్స్ కౌంట్…ఇండస్ట్రీ షాక్!

1

     బహుశా బాలయ్య కెరీర్ లో రీసెంట్ టైం లో ఇలాంటి పరాభవం జరిగి ఉండదు, మాములు సాదాసీదా సినిమా తీసిన బాక్స్ ఆఫీస్ దగ్గర అవలీలగా 15 నుండి 20 కోట్లు వచ్చేవి, స్వర్గీయ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా పరిస్థితి మొదటి వీకెండ్ లోనే తెలిసి పోగా వర్కింగ్ డేస్ లో సినిమా అంతకంతకు స్లో డౌన్ అయి పోయి బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా మారిపోయింది.

కాగా సినిమా రిలీజ్ అవ్వడం వరల్డ్ వైడ్ గా 900 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా రెండు రాష్ట్రాలలోనే ఏకంగా 600 నుండి 650 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది, డే 2 నుండే డెఫిసిట్ లు పడటం తో రోజు రోజు కి థియేటర్స్ ని కోల్పోతూ వచ్చింది ఈ సినిమా.

వర్కింగ్ డేస్ సమయానికి 500 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసినప్పటికీ మొదటి వారం తర్వాత సినిమా పరిస్థితి తెలిసి ఇండస్ట్రీ కూడా షాక్ అవుతుంది అని చెప్పొచ్చు. బయ్యర్ల కి తీవ్ర నష్టాలను మిగిలించినా ఎంతో కొంత వెనక్కి తెస్తుంది అనుకున్నా సినిమా కి థియేటర్స్ రెంట్స్ కట్టే…

కలెక్షన్స్ కూడా రాకపోవడం తో టోటల్ గా థియేటర్స్ కౌంట్ ని తగ్గించేశారు, సినిమా ఆడుతున్న థియేటర్స్ నుండి తొలగించి కొత్త సినిమాలు లేక పాత సినిమాలను వేసుకోవడం తో రెండో వారం సినిమా రెండు రాష్ట్రాల థియేటర్స్ కౌంట్ అత్యంత భారీ గా తగ్గిపోయింది.

రెండో వారం సినిమా కేవలం 80 నుండి 100 వరకు థియేటర్స్ లోనే రన్ అవుతుండటం తో టోటల్ ఇండస్ట్రీ షాక్ అవుతుంది, సినిమా వీకెండ్ తర్వాత మరింతగా థియేటర్స్ తగ్గే చాన్స్ ఉండటం తో బయ్యర్లకి నష్టాలు సంపూర్ణం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా ఫైనల్ రన్ లో 4 కోట్లు అందుకునే చాన్స్ కూడా చాలా తక్కువే అని చెప్పాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here