కోట్లకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటే ఆ సినిమాల పైరసీ దెబ్బ తో కలెక్షన్స్ ఎఫెక్ట్ పడుతూ ఇంపాక్ట్ చూపిస్తుంటే అప్పుడప్పుడు సినిమాల పైరసీలను డైరక్ట్ గా టెలివిజన్ లోనే లోకల్ ఛానెల్స్ టెలికాస్ట్ చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం… వాళ్ళ రేంజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోరు. దాంతో ఈ అడ్వాంటేజ్ ను వాడుకుని సినిమాల మాస్టర్ ప్రింట్స్ ఇలా వస్తాయో లేదో..
వెంటనే వాటిని లోకల్ ఛానెల్స్ లో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు… ఆల్ రెడీ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు అయితే పరుగు ఆల్ మోస్ట్ కంప్లీట్ అవుతుంది కాబట్టి మెయిన్ ఛానెల్ లో వేసే ముందే లోకల్ ఛానెల్స్ లో వేసినా కానీ పెద్దగా పట్టించుకోరు…
కానీ లాస్ట్ ఇయర్ నుండి థియేటర్స్ తో పాటు డిజిటల్ లో కూడా సినిమాలు వరుస పెట్టి రిలీజ్ అవుతూ ఉండగా వాటిలో చాలా వరకు సినిమాలను లోకల్ ఛానెల్స్ లో వేస్తూ ఉన్నారు చాలా మంది… ఆ విషయం మేకర్స్ దాకా వెళ్ళే సరికి కొన్ని ఛానెల్స్ కి ఫైన్స్ వేసినా కానీ…
మరో సినిమా రిలీజ్ టైం కి మళ్ళీ ఇదే తంతు కంటిన్యూగా జరుగుతూనే ఉంది, ఇక లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం 2 సినిమాను ఇలా రిలీజ్ చేశారో లేదో వెంటనే లోకల్ ఛానెల్స్ లో వేయడం స్టార్ట్ చేశారు. చాలా ఛానెల్స్ లో సినిమాను ఇలానే టెలికాస్ట్ చేయగా… వాటి గురించి మేకర్స్ వరకు వెళ్ళడంతో కొన్ని ఛానెల్స్ ని గుర్తించి…
వాళ్ళకి ఇలా ఇల్లీగల్ గా సినిమాను టెలికాస్ట్ చేసిన కారణంగా ఒక్కో ఛానెల్ కి 55 లక్షల దాకా ఫైన్ కట్టి తీరాల్సిందేనని లేదా ఛానెల్ లైసన్స్ ను కాన్సిల్ చేయిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారట. 32 కోట్ల సినిమా ని ఇలా చేయడం వలన డిజిటల్ లో చూసే వాళ్ళు తగ్గుతారు. గతంలో కూడా కొన్ని సార్లు ఇలానే జరిగి ఫైన్స్ వేసినా పట్టించుకోకుండా మళ్ళీ కొత్త సినిమా రిలీజ్ టైం కి ఇదే రిపీట్ అవుతుంది. మరి ఈ సారితో అయినా దీనికి బ్రేక్ పడుతుందో లేదో చూడాలి.